Nellore: లారీని తప్పించబోయి.. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు!

Nellore: నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై సంగం మండలం కోలగట్ల వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. లారీని తప్పించబోయి వేప చెట్టును ఢీకొట్టి పంట పొలాల్లో బోల్తా పడింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 April 2026 8:02 AM IST
Nellore
X

Nellore: లారీని తప్పించబోయి.. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు!

Nellore: సంగం మండలం కోలగట్ల సమీపంలో నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంతపురం నుండి నెల్లూరు వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చిన లారీని తప్పించబోయి అదుపుతప్పి వేప చెట్టును ఢీకొని పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది.ఈ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 22 మంది ప్రయాణికులు ఉండగా ఐదు మందికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పెను ప్రమాదమే ప్రమాదం తప్పిందని ఆర్టీసీ అధికారులు ఊపిరిపించుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద ఘటన తెలియగానే ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ సంఘటనా స్థలానికి చేరుకుని.ప్రమాద ఘటన వివరాల ఆత్మకూరు సిఐ గంగాధర్, సంగం ఎస్సై రాజేష్ లను అడిగి తెలుసుకున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story