Nellore: ఆత్మకూరు అంగన్‌వాడీలో అంబేడ్కర్ జయంతి.. చిన్నారులకు స్ఫూర్తిప్రదాత!
Nellore: ఆత్మకూరు పట్టణంలోని ఎల్.ఆర్. పల్లి-1 అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు.
Nellore: ఆత్మకూరు అంగన్‌వాడీలో అంబేడ్కర్ జయంతి.. చిన్నారులకు స్ఫూర్తిప్రదాత!
ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలోని ఎల్ ర్ పల్లి 1 సెంటర్ అంగన్వాడీ కేంద్రంలో ఆత్మకూరు సిడిపిఓ, సూపర్వైజర్ ఆదేశాలతో ముందస్తు డాక్టర్. బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా అంగన్వాడి టీచర్ షేక్.షకీలా ఆధ్వర్యంలో నిర్వహించారు. కేంద్రంలోని చిన్నారులతో, అంబేద్కర్ మన రాజ్యాంగ నిర్మాత, ప్రముఖ సంఘసంస్కర్త, ఆర్థిక వేత్త, న్యాయ వాది అని, ఆయన మరణాంతరం 1990 లో భారత రత్న బిరుదు లభించిందని కార్యకర్త చిన్నారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా, అంగన్వాడి పిల్లలు,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Next Story




