Tirupati: శ్రీరాంనగర్ కాలనీలో దొంగల బీభత్సం.. పట్టాపగలే చైన్ స్నాచింగ్

Tirupati: తిరుపతి జిల్లా నాయుడుపేట శ్రీరాంనగర్ కాలనీలో దొంగల హల్చల్. కిరాణా దుకాణం నడుపుతున్న గిరిజమ్మ అనే మహిళను మాటల్లో దించి, మెడలోని 4 సవార్ల బంగారు గొలుసును లాక్కెళ్లిన ఇద్దరు దుండగులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 April 2026 3:05 PM IST
Tirupati
X

Tirupati: శ్రీరాంనగర్ కాలనీలో దొంగల బీభత్సం.. పట్టాపగలే చైన్ స్నాచింగ్

తిరుపతి జిల్లా: నాయుడుపేట మండలం శ్రీరాంనగర్ కాలనీలో గిరిజమ్మ అనే మహిళ మెడలో నుండి నాలుగు సవరణ బంగారు గొలుసును లాక్కుని వెళ్లిన దుండగులు, గిరిజమ్మ అనే మహిళ నాయుడుపేట శ్రీ రమ్ నగర్ లో చిన్న దుకాణం నడుపుతుంది ముందుగా బైకులో అక్కడకు వచ్చిన ఇద్దరు దొంగలు రెండు వాటర్ ప్యాకెట్లను ఇమ్మని అడిగారు, గిరిజమ్మ ఇక్కడ వాటర్ ప్యాకెట్లు అమ్మరు అని తెలపడంతో అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్లిన ఆ ఇద్దరు దొంగలు మరల ఆ దుకాణం వద్దకు వచ్చి గిరిజమ ను నాలుగు చాక్లెట్లు ఇవ్వమని అడగగా ఆమె నాలుగు చాక్లెట్లను తీసి ఇస్తున్న సమయంలో మెడలో నుండి నాలుగు సవరలు బంగారు గొలుసును లాక్కొని బైకుపై అక్కడినుండి పారిపోయారు, మెడలో నుండి చేను లాగడంతో గిరిజమ్మ కేకలు వేస్తూ కిందపడిపోయింది ఇంతలో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అడగగా గిరిజమ్మ విషయం చుట్టుపక్కల వాళ్లకు తెలపడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గిరిజమ్మను అడుగగా గిరిజమ్మ జరిగిన విషయం మొత్తం పోలీసులకు తెలియజేసింది. నాయుడుపేట పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి సంఘటన నాయుడుపేటలోని శ్రీరామ్ నగర్ లో జరగడంతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డట్టు అయ్యింది. ఇప్పటికే పలుమార్లు నాయుడుపేట పట్టణంలో ఇలాంటి సంఘటనలు అనేకం చోటు చేసుకోవడం జరిగిందని పోలీసులు కచ్చితంగా నిఘా ఏర్పాట్లను చేయాలని ఇలాంటి సంఘటనలను జరగకుండా అరికట్టే విధంగా పోలీసులు చర్యలు చేపట్టాలని అక్కడి స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story