Tulsi Gabbard: అమెరికా నిఘా విభాగం చీఫ్ తులసి గబ్బార్డ్ రాజీనామా!
Tulsi Gabbard: అమెరికా జాతీయ నిఘా విభాగం (DNI) డైరెక్టర్ తులసి గబ్బార్డ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న తన భర్త అబ్రహంకు తోడుగా ఉండేందుకు ఆమె తన పదవికి రాజీనామా చేశారు.
Tulsi Gabbard: అమెరికా నిఘా విభాగం చీఫ్ తులసి గబ్బార్డ్ రాజీనామా!
Tulsi Gabbard: యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న తన భర్తకు మద్దతుగా నిలిచేందుకు తన పదవికి ఆమె రాజీనామా చేశారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు పంపిన రాజీనామా లేఖను తులసి గబ్బార్డ్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. తులసి భర్త అబ్రహం ఇటీవల ఒక అరుదైన బోన్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో జూన్ 30 నుంచి తన రాజీనామా అమలులోకి వస్తుందని ఆమె స్పష్టం చేశారు.
తన భర్త అబ్రహంకు ఇటీవల అత్యంత అరుదైన బోన్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని.. రాబోయే రోజుల్లో ఆయన ఎన్నో సవాళ్లను, కఠినమైన చికిత్సలను ఎదుర్కోవాల్సి ఉందని పేర్కొన్నారు. అందుకే ఆయనకు సపోర్ట్‌గా ఉండేందుకు తమ పదవికి రాజీనామా చేయాల్సి వస్తోందని చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో తను ప్రజా సేవకు దూరంగా జరిగి, ఆయన వెన్నంటే ఉంటూ పూర్తి మద్దతు అందించడం తమ బాధ్యతగా పేర్కొన్నారు. తమపై నమ్మకం ఉంచి 'ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్'కు నాయకత్వం వహించే అవకాశం కల్పించినందుకు ప్రెసిడెంట్ ట్రంప్‌కు ధన్యవాదాలు" అని తన రాజీనామా లేఖలో గబ్బార్డ్ పేర్కొన్నారు. కాగా గబ్బార్డ్ గైర్హాజరీలో జాతీయ నిఘా సంస్థ తాత్కాలిక సంచాలకుడిగా ఆరోన్ లూకాస్ వ్యవహరిస్తారని ట్రంప్ ప్రకటించారు.




