అమెరికా ఆఫర్‌ను తిరస్కరించిన ఇరాన్? అసలేం జరుగుతోంది?

పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు సరఫరా పెంచేందుకు ఇరాన్ చమురుపై అమెరికా ఆంక్షలను 30 రోజుల పాటు సడలించింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 21 March 2026 4:24 PM IST
అమెరికా ఆఫర్‌ను తిరస్కరించిన ఇరాన్? అసలేం జరుగుతోంది?
X

వాషింగ్టన్/టెహ్రాన్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తకుండా అమెరికా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ ముడి చమురు విక్రయాలపై విధిించిన ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.

14 కోట్ల బ్యారెళ్ల చమురు మార్కెట్‌లోకి:

అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు సరఫరాను పెంచి, ధరలను నియంత్రించే లక్ష్యంతో ఇరాన్ చమురు విక్రయాలకు 30 రోజుల పాటు మినహాయింపు ఇస్తున్నట్లు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ తెలిపారు. ఈ తాత్కాలిక నిర్ణయం వల్ల దాదాపు 14 కోట్ల బ్యారెళ్ల ఇరాన్ చమురు ప్రపంచ మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తుందని ఆయన వివరించారు. అయితే, ఈ మినహాయింపు కేవలం సముద్రంలో నిలిచిపోయిన నిల్వలకు మాత్రమే వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఇరాన్ రిటార్ట్: మా వద్ద అదనపు నిల్వలు లేవు!

అమెరికా ప్రకటించిన మినహాయింపులపై ఇరాన్ ప్రభుత్వం భిన్నంగా స్పందించింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌కు సరఫరా చేసేందుకు తమ వద్ద ఎటువంటి అదనపు ముడి చమురు నిల్వలు లేవని టెహ్రాన్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరాన్ ఇంధన మంత్రిత్వ శాఖ ప్రతినిధి 'X' (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేస్తూ.. అమెరికా ప్రకటనతో తమకు సంబంధం లేదన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు.

ప్రపంచ మార్కెట్‌పై ప్రభావం:

యుద్ధం కారణంగా ఇంధన సరఫరా దెబ్బతింటుందన్న ఆందోళనల మధ్య అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఒకవేళ ఇరాన్ చమురు మార్కెట్‌లోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story