US Iran War Update: హార్ముజ్ జలసంధిలో ఇరాన్ యుద్ధనౌకలపై అమెరికా మెరుపుదాడి..ధృతమైన పశ్చిమాసియా యుద్ధం

US Iran War Update: హార్ముజ్ జలసంధిలో 16 ఇరానియన్ బోట్లను అమెరికా ధ్వంసం చేసింది. ఇరాన్‌పై అతిపెద్ద దాడులకు సిద్ధమంటున్న అమెరికా.

KVD Varma
Published on: 11 March 2026 9:41 AM IST
US Iran War Update: హార్ముజ్ జలసంధిలో 16 ఇరానియన్ బోట్లను అమెరికా ధ్వంసం చేసింది. ఇరాన్‌పై అతిపెద్ద దాడులకు సిద్ధమంటున్న అమెరికా
X

US Iran War Update

US Iran War Update: అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య సాగుతున్న భీకర యుద్ధం 11వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో అడ్డంకులు సృష్టించే ఇరాన్‌కు చెందిన 16 పడవలను అమెరికా దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ధృవీకరిస్తూ, ఇరాన్ దుశ్చర్యలను అడ్డుకునేందుకు ఇలాంటి దాడులు మున్ముందు కూడా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ఈ దాడికి సంబంధించిన దృశ్యాలను యుఎస్ సెంట్రల్ కమాండ్ తమ అధికారిక సోషల్ మీడియా వేదికపై విడుదల చేసింది. సముద్ర మార్గాల్లో ఇరాన్ విసురుతున్న సవాళ్ళను తిప్పికొట్టేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా పేర్కొంది.

అతిపెద్ద వైమానిక దాడులు

US Iran War Update: మరోవైపు, అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ మంగళవారం కీలక ప్రకటన చేశారు. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు చరిత్రలోనే అతిపెద్ద, అత్యంత తీవ్రమైన వైమానిక దాడులను ప్రారంభించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ భారీ ఆపరేషన్‌లో పెద్ద సంఖ్యలో అత్యాధునిక యుద్ధ విమానాలు, బాంబర్లు పాల్గొంటాయని ఆయన పేర్కొన్నారు.




ఇప్పటికే జరిగిన దాడుల వల్ల ఇరాన్ సైనిక శక్తి క్రమంగా బలహీనపడుతోందని, ఆ దేశం కోలుకోలేని ఓటమిని చవిచూడబోతోందని అమెరికా రక్షణ శాఖ ధీమా వ్యక్తం చేసింది. ఇరాన్ లోని ముఖ్యమైన సైనిక స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు సాగుతున్నాయి.

ధీటుగా సమాధానం ఇచ్చిన ఇరాన్ అమెరికా హెచ్చరికలపై ఇరాన్ కూడా అంతే తీవ్రంగా స్పందించింది. తాము ఎటువంటి బెదిరింపులకు భయపడబోమని ఆ దేశ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లారిజాని స్పష్టం చేశారు. ఇరాన్‌ను నాశనం చేయాలనుకునే వారు ముందుగా దాని పర్యవసానాల గురించి ఆలోచించాలని ఆయన హెచ్చరించారు.

చరిత్రలో ఎందరో శక్తివంతమైన నేతలు ఇరాన్‌ను అణచివేయాలని ప్రయత్నించి విఫలమయ్యారని లారిజాని గుర్తు చేశారు. ఇరాన్ ప్రజలు మరియు సైన్యం దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, అమెరికా దాడులను ధీటుగా ఎదుర్కొంటామని ఆయన ప్రకటించారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

హార్ముజ్ జలసంధిలో జరుగుతున్న ఈ దాడులు అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో ఎక్కువ భాగం ఈ మార్గం గుండానే వెళ్తుంది. ఇక్కడ ఉద్రిక్తతలు పెరుగుతుండడం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరల పెరుగుదలకు కారణంగా మారుతోంది.

KVD Varma

KVD Varma

Next Story