Trump Iran War Options: చైనాతో ట్రంప్‌ స్నేహహస్తం... ఇరాన్‌పై కీలక నిర్ణయం?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ త్వరలోనే చైనాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన గతంలోనే కన్ఫర్మ్‌ అయినా ఇరాన్‌తో యుద్దం కారణంగా వాయిదా పడింది. అయితే, మరోసారి వాయిదా వేయకుండా వెంటనే చైనాలో పర్యటించేందుకు ట్రంప్‌ సిద్దమౌతున్నారు.

Balachander
Published on: 1 May 2026 10:15 AM IST
Trump Iran War Options:  చైనాతో ట్రంప్‌ స్నేహహస్తం... ఇరాన్‌పై కీలక నిర్ణయం?
X

Trump Iran War Options: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ త్వరలోనే చైనాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన గతంలోనే కన్ఫర్మ్‌ అయినా ఇరాన్‌తో యుద్దం కారణంగా వాయిదా పడింది. అయితే, మరోసారి వాయిదా వేయకుండా వెంటనే చైనాలో పర్యటించేందుకు ట్రంప్‌ సిద్దమౌతున్నారు. ట్రంప్‌ చైనాలో పర్యటించడానికి ముందే ఇరాన్‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇరాన్‌తో చైనాకు మంచి సంబంధాలు ఉన్నాయి. రెండు దేశాల మధ్య 25 సంవత్సరాల వాణిజ్యబంధం ఉంది. 25 ఏళ్లపాటు చమురును సరఫరా చేయాలి. కానీ, ఇప్పుడు యుద్ధం కారణంగా చమురు రవాణా ఆగిపోయింది. ఇటు ఇరాన్‌పై సైనిక చర్య, అటు చైనాతో దౌత్య సంబంధాల మధ్య సమతుల్యత పాటించడం ఇప్పుడు వైట్‌హౌస్‌కు పెద్ద సవాలుగా మారింది.

వాయిదా పడకూడదన్నదే లక్ష్యం

ఇరాన్‌తో యుద్ధం ఎవరు ఎందుకు ప్రారంభించారు అని ఇప్పుడు చెప్పుకోవడం అనవసరం. కానీ, ఈ యుద్ధం కారణంగా చైనా పర్యటనను ట్రంప్‌ వాయిదా వేసుకున్నాడు. మరోసారి వాయిదా వేసుకోవడం వలన ఆ దేశంతో కలిసి నిర్వహించాలని అనుకున్న దౌత్య, వాణిజ్య ఒప్పందాలు మరుగున పడిపోతాయి. ఇలా వాయిదా వేసుకుంటూ పోవడం వలన అమెరికాకు పలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. దీంతో హడావుడిగా పర్యటన తేదీలను ఖరారు చేశారు. మే 14, మే 15 తేదీల్లో ట్రంప్‌ చైనాలో పర్యటించనున్నారు. చైనా పర్యటనను అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా చూస్తున్నారు. అదేవిధంగా ఇరాన్‌ విషయంలో అన్ని ప్రత్యామ్నాయ అంశాలను పరిశీలిస్తున్నట్టు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ స్పష్టం చేసింది.

హోర్ముజ్ జలసంధి దిగ్బంధం - చైనా ఆందోళన

ప్రస్తుతం ఇరాన్ రేవులు, హోర్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న దిగ్బంధం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది. మార్చి మొదటి వారం నుండి హోర్ముజ్ జలసంధి మూతపడటంతో చైనా వంటి దేశాలకు చమురు సరఫరా నిలిచిపోయింది. చైనా తన అవసరాలకు కావాల్సిన చమురులో ఎక్కువ భాగం ఈ మార్గం ద్వారానే దిగుమతి చేసుకుంటుంది. ఈ మార్గం మూతపడటంతో చైనా ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. చైనాను దారిలోకి తెచ్చుకోవడానికి, ఇరాన్‌ విషయంలో అమెరికా వెనక్కి తగ్గినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు నిపుణులు. అమెరికాకు చైనా అతిపెద్ద మార్కెట్‌. చైనాతో వాణిజ్య సంబంధాలు దెబ్బతింటే లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతుంది. దానికంటే యుద్ధం నుంచి పక్కకు తప్పుకుంటున్నట్టు ప్రకటించడమే మేలు.

మధ్యవర్తిత్వం వహిస్తుందా?

ఇప్పుడు ఇంకో అంశం కూడా తెరమీదకు వచ్చింది. ఇరాన్‌తో జరుగుతున్న యుద్దాన్ని ముగించడంలో నిర్మాణాత్మక పాత్రను పోషిస్తామని బీజింగ్‌ ప్రకటించింది. కానీ, ఇరాన్‌ నుంచి పెద్ద మొత్తంలో చమురును కొనుగోలు చేస్తున్న చైనా రిఫైనరీలపై ట్రంప్‌ ఇప్పటికే ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో చైనా పర్యటనలో ఇరాన్‌ అంశం చర్చకు వస్తే అది ప్రమంచ చమురు ధరలపై, దేశాల మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలపై కూడా తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. యుద్ధం కొనసాగించాలా లేక దౌత్యపరంగా చైనాతో కలిసి ముందుకెళ్ళాలా అన్నదే ఇప్పుడు ట్రంప్ ముందున్న అసలు ప్రశ్న. ఈ పర్యటన ముగిసే వరకు ఇరాన్ విషయంలో అమెరికా ఎటువంటి పెద్ద నిర్ణయం తీసుకోకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story