Nigeria: నైజీరియాలో ఉగ్రవాదుల నరమేధం: తూటాల వర్షంలో 29 మంది బలి!
Nigeria: నైజీరియాలోని అడమావా రాష్ట్రంలో ఉగ్రవాదులు ఘోరకలి సృష్టించారు. గుయాకు గ్రామంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి 29 మందిని హతమార్చారు.
Nigeria: నైజీరియాలో ఉగ్రవాదుల నరమేధం: తూటాల వర్షంలో 29 మంది బలి!
Nigeria: పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజీరియాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. అడమావా రాష్ట్రంలోని ఒక గ్రామంలో మిలిటెట్టు బీభత్సం సృష్టించారు. అమాయక ప్రజలపై విచణారహితంగా కాల్పులు జరిపడంతో 29 మంది పౌరులను మృతి చెందారు. గోంబి స్థానిక ప్రభుత్వ ప్రాంతంలోని గుయాకు కమ్యూనిటీలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. రాత్రి సమయంలో భారీ ఆయుధాలతో మిలిటెంట్లు గ్రామంలోకి చోరబడి విచణారహితంగా కాల్పులు జరపడంతో ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రజలు పరుగుతీశారు.
ఈ ఘటనపై అడమావా రాష్ట్ర గవర్నర్ అహ్మదు ఉమారు ఫింటిరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు. మిలిటెంట్ల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఇది ఇలా ఉండగా ఈ ఘటనకు తామే బాధ్యులమని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ తన అధికారిక టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ప్రకటించింది.




