Stock Market: ట్రంప్ 'మ్యాజిక్'.. స్టాక్ మార్కెట్‌లో లాభాల జోష్.. ఒక్కరోజే రూ.9 లక్షల కోట్ల లాభం!

Stock Market: సోమవారం నాటి భారీ పతనం తర్వాత భారత స్టాక్ మార్కెట్ మళ్లీ పుంజుకుంది. డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద రూ.9 లక్షల కోట్లు పెరిగింది. సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లో పయనించడానికి గల ప్రధాన 4 కారణాలను ఈ స్టోరీలో తెలుసుకోండి.

Ganesh
Published on: 24 March 2026 5:42 PM IST
Stock Market
X

Stock Market: ట్రంప్ 'మ్యాజిక్'.. స్టాక్ మార్కెట్‌లో లాభాల జోష్.. ఒక్కరోజే రూ.9 లక్షల కోట్ల లాభం!

Stock Market:సోమవారం బేర్ గుప్పిట్లో చిక్కుకుని విలవిల్లాడిన స్టాక్ట్ మార్కెట్, మంగళవారం బుల్ రన్‌తో దూసుకెళ్లాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీలు భారీ లాభాలను నమోదు చేశాయి. మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,372 పాయింట్లు (1.89%) లాభపడి 74,068 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ 400 పాయింట్లు (1.78%) పెరిగి 22,912 వద్ద క్లోజ్ అయ్యింది. ట్రేడింగ్ మధ్యలో సెన్సెక్స్ ఒకానొక దశలో 1,655 పాయింట్ల వరకు పెరగడం మార్కెట్ జోరుకు నిదర్శనం. బీఎస్ఈలోని టాప్ 30 స్టాక్స్‌లో 27 షేర్లు లాభాల్లో ముగియగా.. ఎల్&టి (L&T), ఇండిగో, ఎటర్నల్ వంటి సంస్థలు టాప్ గెయినర్లుగా నిలిచాయి.

మార్కెట్ పుంజుకోవడానికి ప్రధాన కారణాలు ఇవే..

ఇరాన్‌పై దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం మార్కెట్లకు బూస్ట్ ఇచ్చిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి తోడు ఇరాన్-అమెరికా మధ్య చర్చలు జరిగే అవకాశం ఉందన్న వార్తలు ఉద్రిక్తతలను తగ్గించాయి. యుద్ధ భయాలు తగ్గడంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు $110 నుంచి $104.1 కి పడిపోయాయి. ఇది భారత్ వంటి చమురు దిగుమతి చేసుకునే దేశాల మార్కెట్లకు సానుకూల అంశం.

ఆసియా మార్కెట్లయిన జపాన్ (Nikkei 225), దక్షిణ కొరియా (Kospi), హాంగ్‌కాంగ్ (Hang Seng) లాభాల్లో పయనించడం దేశీయ మార్కెట్లకు కలిసొచ్చింది. అలాగే అమెరికా వాల్‌స్ట్రీట్ ఫ్యూచర్స్ కూడా స్థిరంగా ఉండటం సానుకూల సంకేతాలను ఇచ్చింది. ఈరోజు మార్కెట్లో దాదాపు అన్ని రంగాలు గ్రీన్ జోన్‌లోనే ముగిశాయి. ముఖ్యంగా ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, మీడియా రంగాలు 3 శాతం మేర లాభపడ్డాయి. ఐటీ, మెటల్ షేర్లకు కూడా మంచి డిమాండ్ కనిపించింది. సోమవారం నాటి భారీ పతనంలో లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లకు ఈరోజు ఊరట లభించిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. సుమారు 2,932 షేర్లు లాభపడగా, కేవలం 945 షేర్లు మాత్రమే స్వల్ప నష్టాలను చూశాయి. ఈ ఒక్కరోజు ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.9 లక్షల కోట్లు పెరిగిందని చెప్పారు.

Ganesh

Ganesh

2022లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 4 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. లైఫ్ స్టైల్, బిజినెస్‌, మూవీస్, స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా సినిమా గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story