Canada: కెనడాలో పంజాబ్ యువతి దారుణ హత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగుడు!
Canada: కెనడాలోని టొరంటోలో పంజాబ్‌కు చెందిన నవ్‌నీత్ కౌర్ (26) అనే యువతి దారుణ హత్యకు గురైంది.
Canada: కెనడాలో పంజాబ్ యువతి దారుణ హత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగుడు!
Canada: కెనడాలోని టొరంటో నగరంలో దారుణం చోటుచేసుకుంది. పంజాబ్‌కు చెందిన నవ్‌నీత్ కౌర్ (26) అనే భారతీయ యువతి దారుణ హత్యకు గురైంది. నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను ఓ వ్యక్తి తుపాకీతో కాల్చి చంపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం.. నవ్‌నీత్ కౌర్ బులేవార్డ్ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తుండగా, ఒక వ్యక్తి ఆమెను వెంబడించాడు. కొద్దిసేపు ఆమెతో మాట్లాడిన అనంతరం, ఎలాంటి హెచ్చరిక లేకుండా ఒక్కసారిగా తుపాకీతో తీవ్రంగా కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో నవ్‌నీత్ కౌర్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవ లేదా వాగ్వాదం జరగకుండానే నిందితుడు కాల్పులకు తెగబడ్డాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ ఘోరానికి పాల్పడిన 37 ఏళ్ల శరణ్‌జీత్ సింగ్‌ను కెనడా పోలీసులు వేగంగా స్పందించి అరెస్టు చేశారు. నిందితుడు కూడా పంజాబ్ ప్రాంతానికి చెందినవాడేనని పోలీసులు నిర్ధారించారు.
సంఘటనా స్థలం పరిసర ప్రాంతాల్లో డ్రోన్లు, ఆధునిక సాంకేతిక పరికరాల సహాయంతో గాలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఇది ముందస్తు ప్రణాళిక ప్రకారం చేసిన ‘టార్గెటెడ్ అటాక్’గా భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే హత్య వెనుక ఉన్న అసలు కారణాలు, వ్యక్తిగత కక్షలా లేదా మరేదైనా ఉందా అనే కోణంలో సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.




