Imran Khan: ఇమ్రాన్ ఖాన్ మరణించారంటూ పాక్ జర్నలిస్ట్ సంచలన పోస్ట్.. పాకిస్థాన్‌లో తీవ్ర ఉద్రిక్తత!

Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించారంటూ జర్నలిస్ట్ సయీద్ ఖాన్ సంచలన పోస్ట్.

Arun Chilukuri
Published on: 12 Aug 2026 4:58 PM IST
Imran Khan
X

Imran Khan: ఇమ్రాన్ ఖాన్ మరణించారంటూ పాక్ జర్నలిస్ట్ సంచలన పోస్ట్.. పాకిస్థాన్‌లో తీవ్ర ఉద్రిక్తత!

Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (PTI) అధినేత ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) జైల్లోనే మృతి చెందినట్లు సయీద్ ఖాన్ అనే పాకిస్థానీ జర్నలిస్ట్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ తీవ్ర కలకలం రేపింది. ఇమ్రాన్ ఖాన్ మరణించినట్లు తనకు ముగ్గురు సీనియర్ సైనికాధికారులు ధ్రువీకరించారని సయీద్ ఖాన్ పేర్కొనడంతో పాక్‌లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకుంది.

గత కొన్ని రోజులుగా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులకు, వ్యక్తిగత వైద్యులకు అధికారులు అనుమతి నిరాకరించడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. అయితే ఈ వార్తలపై పాకిస్థాన్ ప్రభుత్వం గానీ, జైలు అధికారులు గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

ఇమ్రాన్ ఖాన్‌కు ఏమైనా జరిగితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి రావడానికి 20 లక్షల మంది సిద్ధంగా ఉన్నారని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ముఖ్యమంత్రి, పీటీఐ నేత సోహైల్ అఫ్రిది హెచ్చరించారు. యువత ఆగ్రహంతో రోడ్డెక్కితే వారిని కట్టడి చేయడం పాక్ సైన్యం వల్ల కూడా కాదని స్పష్టం చేశారు.

ఇమ్రాన్‌ను కలవడానికి అనుమతి ఇవ్వకపోతే సెప్టెంబర్ 27న రాజధాని ఇస్లామాబాద్ వైపు భారీ ర్యాలీ చేపట్టి దేశవ్యాప్త నిరసనలు నిర్వహిస్తామని పీటీఐ హెచ్చరించింది. పాక్ మాజీ ప్రధాని ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత లేకపోవడంతో పీటీఐ కార్యకర్తలు, ఇమ్రాన్ మద్దతుదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story