Nepal Floods: భారీ వరదలతో అతలాకుతలమైన నేపాల్.. పొంచివున్న మరో ముప్పు!

Nepal Floods: నేపాల్‌లో సంభవించిన భీకర వరదల కారణంగా మృతుల సంఖ్య 903కి చేరింది. 4200 మందికిపైగా గల్లంతయ్యారు.

Arun Chilukuri
Published on: 31 Aug 2026 1:06 PM IST
Nepal Floods
X

Nepal Floods: భారీ వరదలతో అతలాకుతలమైన నేపాల్.. పొంచివున్న మరో ముప్పు!

Nepal Floods: భీకర జలప్రళయంతో అతలాకుతలమైన నేపాల్ ఇంకా కోలుకోలేదు. ఆరు రోజుల క్రితం వచ్చిన ఆకస్మిక వరదల కారణంగా మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నేపాల్ సరిహద్దులోని పలు హైడ్రో ప్రాజెక్టులు కొట్టుకుపోగా, ప్రాజెక్టుల సొరంగాల్లో 930 మందికి పైగా సిబ్బంది చిక్కుకుపోయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. వారిని రక్షించేందుకు ఆర్మీ నిరంతరం శ్రమిస్తోంది.

"ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 903 మంది ప్రాణాలు కోల్పోగా.. 4200 మందికిపైగా గల్లంతయ్యారు. వారిలో దాదాపు 500 మంది విదేశీయులు ఉన్నారు."

హిమానీనదం శిథిలాలు, బండరాళ్లతో చైనా-నేపాల్ సరిహద్దులో ఏర్పడిన సరస్సు కారణంగా దిగువ ప్రాంతాలకు ఇంకా వరద ముప్పు పొంచే ఉంది. దీనివల్ల బోటెకోషి నదిలో నీటి ప్రవాహం పెరుగుతూనే ఉంది.

చైనా ఇస్తోన్న సమాచారం ఆధారంగా నేపాల్ ప్రభుత్వం దిగువ ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. ఆదివారం వరద హెచ్చరికల మెసేజ్‌లతో ప్రజల ఫోన్లు మోగడంతో, ఇప్పటికే ఆత్మీయులను కోల్పోయి నిలువనీడలేకుండా ఉన్న బాధితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

త్రిశూలీ నదికి ఆదివారం దాదాపు మూడు గంటల పాటు భారీ వరద పోటెత్తడంతో 130 మీటర్ల పొడవైన ‘ఘ్యాల్‌చౌక్‌-చరౌడీ’ సస్పెన్షన్ బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోయింది. గల్లంతయిన వారి కోసం ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story