JD Vance 2028 Strategy: జేడీ వాన్స్‌ సరికొత్త వ్యూహం...ప్రత్యర్థిని ఇరుకునపెడుతూ రాజకీయ ఎత్తుగడ

అమెరికా 2028 ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఈ వ్యూహంలో ముందున్నాడు. తన ప్రత్యర్థులను ఇరుకున పెడుతూ సరికొత్త రాజకీయాలకు తెరలేపాడు.

Balachander
Published on: 30 Jun 2026 7:27 AM IST
JD Vance 2028 Strategy: జేడీ వాన్స్‌ సరికొత్త వ్యూహం...ప్రత్యర్థిని ఇరుకునపెడుతూ రాజకీయ ఎత్తుగడ
X

JD Vance 2028 Strategy: అమెరికా రాజకీయాల్లో 2028 అధ్యక్ష ఎన్నికల రేసు ఇప్పటి నుంచే హీటెక్కుతోంది. రిపబ్లికన్ పార్టీలో కీలక నేతలైన వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియోల మధ్య తీవ్రమైన అంతర్గత పోటీ నడుస్తోందనే వార్తలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ విదేశాంగ విధానాన్ని ఆసరాగా చేసుకుని, మార్కో రూబియోను ఇరుకున పెట్టేలా జేడీ వాన్స్ వేస్తున్న సరికొత్త రాజకీయం ఇప్పుడు అమెరికా రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

ఇజ్రాయిల్‌ మద్దతు ఎవరికి

సాధారణంగా రిపబ్లికన్ పార్టీ ఇజ్రాయెల్‌కు బేషరతుగా మద్దతు ఇస్తుంది. రూబియో కూడా ఇదే పంథాను అనుసరిస్తూ ఇరాన్‌పై కఠిన వైఖరిని, నెతన్యాహు ప్రభుత్వానికి పూర్తి మద్దతును ప్రకటిస్తున్నారు. అయితే, జేడీ వాన్స్ ఇందుకు భిన్నంగా ట్రంప్‌ ఎన్నికల వ్యూహాన్ని అనుసరిస్తూ... ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. అమెరికా ప్రయోజనాలు, ఇజ్రాయెల్ ప్రయోజనాలు ఒకటి కావు అంటూ వాన్స్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద దుమారాన్నే లేపాయి. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కోసం ఆయన జరిపిన చర్చలు రూబియో శిబిరాన్ని తీవ్రంగా కలవరపెట్టాయి.

వాన్స్ సరికొత్త వ్యూహం అమలౌతుందా?

జేడీ వాన్స్ కేవలం గుడ్డిగా ఈ నిర్ణయం తీసుకోలేదు. అమెరికా ప్రజల నాడిని పట్టుకుని ఆయన ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. తాజా సర్వే ప్రకారం, 50 ఏళ్ల లోపు వయసున్న రిపబ్లికన్ మద్దతుదారులలో 57 శాతం మంది ఇప్పుడు ఇజ్రాయెల్ పట్ల వ్యతిరేక లేదా ప్రతికూల అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఈ గణాంకాలను ముందే పసిగట్టిన వాన్స్, పార్టీలోని సాంప్రదాయ ధోరణిని పక్కనపెట్టి యువ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే ఆయనకు అధ్యక్ష పీఠం ఎక్కించేందుకు అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు. ఇక,

పార్టీ అగ్రనేత డొనాల్డ్ ట్రంప్ ఆశీస్సులు పొందడం, అదే సమయంలో డెమొక్రాట్ అభ్యర్థిగా భావిస్తున్న కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ లాంటి ప్రత్యర్థులను ఎదుర్కోవడం వాన్స్ ముందున్న సవాళ్లు. కానీ, ప్రస్తుతానికైతే రూబియో కంటే ఒక అడుగు ముందే ఉంటూ, ఇజ్రాయెల్ విదేశాంగ విధానాన్ని ఒక 'వెడ్జ్ ఇష్యూ' గా మార్చడంలో వాన్స్ విజయవంతమయ్యారు. ఇది ఆయన రాజకీయ పరిణతికి, భవిష్యత్తు అధ్యక్ష పీఠంపై ఆయనకున్న గురికి నిదర్శనం. మరి ఆయన అనుసరిస్తున్న వ్యూహం ఎంత వరకు ఫలితాలను ఇస్తుందో చూడాలి. రాజకీయంగా ఎదగాలి, అధ్యక్ష పీఠంపై కూర్చోవాలి అంటే ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాన్ని పన్నక తప్పదు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story