Iran War: ప్ర‌పంచంలోనే అతిపెద్ద గ్యాస్ కేంద్రంపై దాడి చేసిన ఇరాన్‌.. భార‌త్‌పై తీవ్ర ప్ర‌భావం

Iran War: మధ్యప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఓవైపు అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే మ‌రోవైపు ఇరాన్ తగ్గేదేలే అన్న‌ట్లు వ్య‌వ‌హారిస్తోంది. తాజాగా ఇరాన్ చేసిన క్షిపణి దాడి ప్రపంచ ఇంధన మార్కెట్లపై భారీ ప్రభావం చూపుతోంది. ఖతార్‌లోని భారీ గ్యాస్ కేంద్రం దెబ్బతినడంతో భారత్ వంటి దేశాలకు పెద్ద సవాళ్లు ఎదురవుతున్నాయి.

Mokshith
Published on: 19 March 2026 3:45 PM IST
Iran War
X

Iran War: ప్ర‌పంచంలోనే అతిపెద్ద గ్యాస్ కేంద్రంపై దాడి చేసిన ఇరాన్‌.. భార‌త్‌పై తీవ్ర ప్ర‌భావం 

Iran War: మధ్యప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఓవైపు అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే మ‌రోవైపు ఇరాన్ తగ్గేదేలే అన్న‌ట్లు వ్య‌వ‌హారిస్తోంది. తాజాగా ఇరాన్ చేసిన క్షిపణి దాడి ప్రపంచ ఇంధన మార్కెట్లపై భారీ ప్రభావం చూపుతోంది. ఖతార్‌లోని భారీ గ్యాస్ కేంద్రం దెబ్బతినడంతో భారత్ వంటి దేశాలకు పెద్ద సవాళ్లు ఎదురవుతున్నాయి.

ఖతార్‌లోని భారీ LNG ప్లాంట్‌పై దాడి

ఇరాన్, ఖతార్‌లో ఉన్న రాస్ లాఫాన్ (Ras Laffan) అనే ప్రపంచంలోనే అతిపెద్ద LNG (Liquefied Natural Gas) కేంద్రంపై క్షిపణి దాడి చేసింది. ఈ దాడి కారణంగా అక్కడ గ్యాస్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయింది. ఖతార్ ప్రపంచంలో అగ్రగామి LNG ఉత్పత్తిదారులలో ఒకటిగా పేరుగాంచింది. అమెరికా, ఆస్ట్రేలియా, రష్యాల సరసన ఇది కీలక స్థానం కలిగి ఉంది.

ఇదిలా ఉంటే.. ఈ దాడులు ఒక్కసారిగా జరగలేదు. ఫిబ్రవరి 28 నుంచి అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఇరాన్‌పై కొనసాగుతున్నాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ మధ్యప్రాచ్యంలో అమెరికా ఆస్తులు, ఇంధన కేంద్రాలను టార్గెట్ చేస్తోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్, ఇరాన్‌లోని సౌత్ పార్స్‌ గ్యాస్ ఫీల్డ్‌పై దాడి చేసిన తర్వాత ఉద్రిక్తతలు పెరిగాయి.

ఈ పరిణామాలతో మొత్తం ప్రాంతం యుద్ధ వాతావరణంలోకి వెళ్లింది.

హార్ముజ్ జలసంధి ప్రభావం

ప్రపంచంలో దాదాపు 20% చమురు సరఫరా జరిగే హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) ఇప్పుడు ప్రమాదకర ప్రాంతంగా మారింది. నౌకల రాకపోకలు దాదాపు ఆగిపోయాయి. 700కి పైగా సరుకు నౌకలు పోర్టుల దగ్గరే నిలిచిపోయాయి. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు, గ్యాస్ ధరలు భారీగా పెరుగుతున్నాయి.

భారత్‌పై తీవ్ర ప్రభావం

భారత్‌కు ఇది చాలా కీలకమైన సమస్యగా మారింది. భారత్ తన గ్యాస్ అవసరాల్లో సుమారు 50% విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అందులో 40% LNG ఖతార్ నుంచే వస్తుంది. అంటే మొత్తం అవసరాల్లో దాదాపు 20% ఖతార్‌పై ఆధారపడుతుంది. ప్రస్తుతం భారత్ రోజుకు 189 MMSCMD గ్యాస్ వినియోగిస్తుంది. ఇందులో 97.5 MMSCMD దేశీయ ఉత్పత్తి కాగా మిగతా దిగుమతుల్లో 47.4 MMSCMD సరఫరా దెబ్బతింది.

ఈ పరిస్థితిలో భారత్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

పరిశ్రమలలో గ్యాస్ వినియోగం తగ్గించడం, విద్యుత్ ఉత్పత్తిలో గ్యాస్ వినియోగం నియంత్రించడం,

ఇతర దేశాల నుంచి LNG దిగుమతులు పెంచడం, ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టడం వంటి చ‌ర్య‌ల‌తో గ్యాస్ కొర‌త‌ను బ్యాలెన్స్ చేసే అవ‌కాశాలు ఉన్నాయి.

Mokshith

Mokshith

Next Story