Plastic Price Hike : సామాన్యుడికి యుద్ధం షాక్.. పెరగనున్న నిత్యావసరాల ధరలు, మందులు!

Plastic Price Hike : "యుద్ధం సెగ సామాన్యుడి వంటింటికి! ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల వల్ల పాలిమర్ల ధరలు భారీగా పెరిగాయి. దీనివల్ల పాలు, బిస్కెట్లు, మందులు మరియు ప్లాస్టిక్ వస్తువుల ధరలు ఏప్రిల్ నుంచి ఎలా పెరగనున్నాయో పూర్తి వివరాలు ఇక్కడ చదవండి."

Ganesh
Published on: 28 March 2026 4:26 PM IST
Plastic Price Hike
X

Plastic Price Hike : సామాన్యుడికి యుద్ధం షాక్.. పెరగనున్న నిత్యావసరాల ధరలు, మందులు!

Plastic Price Hike :ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసును దెబ్బతీస్తోంది. దీని ప్రభావం ఇప్పుడు నేరుగా ప్లాస్టిక్ పరిశ్రమపై పడింది. ప్లాస్టిక్ తయారీకి వాడే ముడి పదార్థాలైన పాలిమర్ల ధరలు భారీగా పెరగడంతో, దైనందిన జీవితంలో మనం వాడే అనేక వస్తువుల ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. భారతదేశపు అతిపెద్ద చమురు సంస్థ IOCL, మార్చి 25న ప్లాస్టిక్ ధరలను మరోసారి పెంచింది. ఈ నెలలోనే ధరలు పెరగడం ఇది నాలుగోసారి (మార్చి 1, 3, 11, 25).

వంటింటిపై పడనున్న భారం..

పివిసి (PVC) టన్నుకు ఏకంగా రూ.13,000 రూపాయలు పెరిగింది, కోపాలిమర్ & పాలిథిలిన్ (PE) టన్నుకు సుమారు రూ.7,000 అదనపు భారం పడింది, పిపిహెచ్ (PPH) టన్నుకు రూ.4,000 పెరిగింది. ఒక్కసారిగా పాలిమర్ల ధరల పెరుగుదల వల్ల ప్యాకేజ్డ్ ఫుడ్స్ (బిస్కెట్లు, చిప్స్), పాలు, జ్యూస్ బాటిళ్లు, ప్లాస్టిక్ బకెట్లు, కంటైనర్ల ధరలు పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కంపెనీలు నేరుగా ధరలను పెంచకపోయినా, ప్యాకెట్ సైజును తగ్గించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు.

వైద్య రంగంపై యుద్ధ మేఘాలు..

యుద్ధం ప్రభావం మందులు, వైద్య పరికరాలపై కూడా పడనుందని నిపుణులు చెబుతున్నారు. పాలిమర్ల ధరలు పెరగడం వల్ల సిరంజీలు, ఐవీ బాటిళ్లు, డయాగ్నోస్టిక్ కిట్లు ధరలు ఏప్రిల్ నుంచి పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. నైట్రైల్ బ్యూటాడీన్ రబ్బర్ లేటెక్స్ (NBR) కొరత వల్ల ఆస్పత్రుల్లో గ్లోవ్స్ ధరలు పెరగడమే కాకుండా, కొరత కూడా ఏర్పడుతోందన్నారు. మందుల ప్యాకేజింగ్, విద్యుత్ ఖర్చులు 20% వరకు పెరిగినట్లు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైస్ ఇండస్ట్రీ (AiMeD) ప్రతినిధులు వెల్లడించారు. ఇరాన్ నియంత్రణలో ఉన్న హోర్ముజ్ జలసంధి మూసివేత వల్ల ప్లాస్టిక్ ముడి పదార్థాల రవాణా వ్యయం 50-60% పెరిగింది. ఇది లాజిస్టిక్స్, పెట్రోకెమికల్ సరఫరాను పూర్తిగా అస్తవ్యస్తం చేసిందని నిపుణులు చెబుతున్నారు. దీని ఫలితంగా ఏప్రిల్ నెలలో వైద్య పరికరాల ధరల్లో భారీ మార్పులు చూసే అవకాశం ఉందని అంటున్నారు.

Ganesh

Ganesh

2022లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 4 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. లైఫ్ స్టైల్, బిజినెస్‌, మూవీస్, స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా సినిమా గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story