Iran attack on Kuwait: యుద్ధంలో కీల‌క మ‌లుపు.. పెట్రోల్‌, డీజీల్ ధ‌ర‌లు భారీగా పెర‌గ‌నున్నాయా.?

Iran attack on Kuwait: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్ తాజాగా కువైట్‌లోని కీలక ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ దాడి చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ప్రభావం చూపుతోంది.

Mokshith
Published on: 20 March 2026 2:31 PM IST
Iran attack on kuwait
X

Iran attack on kuwait: యుద్ధంలో కీల‌క మ‌లుపు.. పెట్రోల్‌, డీజీల్ ధ‌ర‌లు భారీగా పెర‌గ‌నున్నాయా.? 

Iran attack on kuwait: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్ తాజాగా కువైట్‌లోని కీలక ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ దాడి చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ప్రభావం చూపుతోంది.

కువైట్‌లో కీలక రిఫైనరీపై దాడి

ఇరాన్, కువైట్‌లోని మినా అల్-అహ్మ‌దీ రిఫైన‌రీపై డ్రోన్ దాడి చేసింది. ఈ దాడి వల్ల అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. అత్యవసర బృందాలు మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇది కువైట్‌లో అత్యంత ముఖ్యమైన ఆయిల్ ఫెసిలిటీల్లో ఒకటిగా చెబుతున్నారు.

ఈ రిఫైనరీ ప్రాముఖ్యత ఏంటి?

మినా అల్-అహ్మ‌దీ రిఫైన‌రీ రోజుకు సుమారు 7.3 లక్షల బ్యారెల్స్ ముడి చమురు ప్రాసెస్ చేయగలదు. ఇది కువైట్‌లోని మూడు ప్రధాన రిఫైనరీలలో ఒకటి. ఇప్పటికే ఒక రోజు ముందే కొంత నష్టం జరిగినట్టు సమాచారం.

తాజా దాడితో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఇది ఆయిల్ సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌పై భారీగా ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

గల్ఫ్ దేశాల్లో పెరుగుతోన్న ఉద్రిక్తతలు

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మూడో వారంలోకి ప్రవేశించింది. సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. దుబాయ్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. బహ్రెయిన్‌లో గిడ్డంగిలో అగ్ని ప్రమాదం జరిగింది. సౌదీ అరేబియా పలు డ్రోన్లను అడ్డుకుంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప‌లు క్షిపణులు ప్రయోగించింది. మొత్తంగా గల్ఫ్ ప్రాంతంలో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

ప్రపంచ ఆయిల్ మార్కెట్‌లో భారీ మార్పులు

ఈ సంఘటనల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు $119 దాటాయి.

తర్వాత కొంత తగ్గి $107 వద్ద స్థిరపడ్డాయి. కాగా హార్ముజ్ జ‌ల‌సంధిపై భ‌య‌లు మ‌రింత పెరుగుతున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% ఈ మార్గం ద్వారా జరుగుతుంది. ఇది గ్లోబల్ మార్కెట్‌లో అనిశ్చితిని మ‌రింత పెంచుతోంది.

Mokshith

Mokshith

Next Story