Imran Khan: జైలులో ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ముప్పు.. తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కుమారులు!

Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆయన కుమారులు ఆందోళన వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Published on: 26 Aug 2026 12:36 PM IST
Imran Khan
X

Imran Khan: జైలులో ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ముప్పు.. తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కుమారులు!

Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని, పిటిఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణిస్తుండటంపై ఆయన కుమారులు ఖాసీం, సులేమాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత మూడు సంవత్సరాలుగా అడియాలా జైలులో నిర్బంధంలో ఉన్న తమ తండ్రికి ప్రాణాపాయ స్థితి నెలకొందని, జైలు నుంచి ఆయన ప్రాణాలతో బయటపడే అవకాశాలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పక్కనపెట్టి, ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించకుండా పాకిస్థాన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఇమ్రాన్ ఖాన్ కుమారులు ఆరోపించారు.

వెలుతురు, గాలి లేని ఇరుకైన గదిలో ఉంచడం వల్ల ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం దెబ్బతిన్నదని, వైద్య నిర్లక్ష్యం కారణంగా ఆయన కుడి కంటి చూపు దాదాపు మసకబారిందని (దాదాపు చూపు కోల్పోయే స్థితికి చేరిందని) వెల్లడించారు.

గడచిన కొన్ని సంవత్సరాలుగా తండ్రిని నేరుగా కలవడానికి వీసా నిరాకరిస్తున్నారని, ఆఖరికి ఫోన్ కాల్స్‌పై కూడా నిఘా పెట్టి గత ఆరు నెలలుగా మాట్లాడకుండా అడ్డుకున్నారని తెలిపారు. ఇమ్రాన్ ఖాన్‌ను అక్రమంగా బంధించి ఉంచడం వెనుక పాకిస్థాన్ సైనిక వ్యవస్థ ప్రమేయం ఉందని ఆరోపించారు.

ఇమ్రాన్ ఖాన్‌కు మానవతా దృక్పథంతో మెరుగైన చికిత్స అందించాలని కోరుతూ అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాలు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు లేఖ రాశారు. వీరిలో భారత్‌కు చెందిన ప్రముఖ మాజీ క్రికెటర్లు సునీల్ గావస్కర్, కపిల్ దేవ్, దిలీప్ వెంగ్‌సర్కార్ ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story