Gulf Crisis Impact on Africa: గల్ఫ్‌ సంక్షోభం...ఆఫ్రికాకు లాభమా? నష్టమా?

గల్ఫ్‌లో పరిస్థితులు రోజుకోవిధంగా మారుతున్న నేపథ్యంలో ఆఫ్రికాదేశాలు అప్రమత్తమయ్యాయి. చమురుతో పాటు ముడి పదార్థాలను నేరుగా సరఫరా చేయకుండా శుద్ధిచేసి తద్వారా లాభాలు ఆర్జించాలని చూస్తున్నాయి.

Balachander
Published on: 8 July 2026 10:44 AM IST
Gulf Crisis Impact on Africa: గల్ఫ్‌ సంక్షోభం...ఆఫ్రికాకు లాభమా? నష్టమా?
X

Gulf Crisis Impact on Africa: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో గల్ఫ్ ప్రాంతంలో రేగిన మంటలు కేవలం మధ్యప్రాచ్యానికే పరిమితం కాలేదు. అంతర్జాతీయ చమురు మార్కెట్లు, నౌకాయాన రవాణా మార్గాలను అతలాకుతలం చేస్తూ, ఈ సంక్షోభ ప్రభావం సుదూర ఆఫ్రికా ఖండంపై తీవ్రంగా పడుతోంది. అయితే, అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈ గల్ఫ్ సంక్షోభం ఆఫ్రికా దేశాలకు కేవలం ఒక ఆర్థిక సవాలు మాత్రమే కాదు, బాహ్య శక్తులపై ఆధారపడటాన్ని తగ్గించుకుని స్వయంసమృద్ధి సాధించడానికి లభించిన ఒక వినూత్న వ్యూహాత్మక అవకాశం.

ఆఫ్రికా ఆర్థిక వ్యవస్థపై ప్రధాన ప్రతికూల ప్రభావాలు

హార్ముజ్ జలసంధి, ఎర్రసముద్రం మార్గాల్లో ఏర్పడిన ఆటంకాల వల్ల ఆఫ్రికా ఖండం ప్రస్తుతం తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది. చమురు, ఎరువులు మరియు నిత్యావసరాల దిగుమతి ఖర్చులు గణనీయంగా పెరిగాయి. వాషింగ్టన్, దాని మిత్రదేశాలు తమ పూర్తి శ్రద్ధను గల్ఫ్ భద్రతపైనే పెట్టడం వల్ల, సాహెల్, హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతాలలో ఉగ్రవాద నిరోధక చర్యలకు అందుతున్న అంతర్జాతీయ మద్దతు క్షీణించింది. ఇరాన్ సంక్షోభం కారణంగా సూడాన్ అంతర్యుద్ధంలో సౌదీ అరేబియా, యూఏఈల మధ్య ఆధిపత్య పోరు మరింత తీవ్రరూపం దాల్చింది.

వ్యూహాత్మక మార్పు... స్వయంసమృద్ధి వైపు అడుగులు

ఈ సంక్షోభం ఆఫ్రికా పాలకులలో ఒక కొత్త ఆలోచనకు బీజం వేసింది. ఆఫ్రికా దేశాలు తమ ముడిచమురును ఎగుమతి చేస్తూ, తిరిగి శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల కోసం గల్ఫ్ దేశాలపై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ఈ సంక్షోభం నిరూపించింది. ఈ నేపథ్యంలోనే స్వయం సమృద్ధిని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా నైజీరియాలో డాంగోట్‌ రిఫైనరీని ప్రారంభించింది. ఈ రిఫైనరీలో రోజుకు 6.50 లక్షల బ్యారెళ్ల ఇంధనాన్ని శుద్ధి చేస్తున్నారు. ఇక, ఆఫ్రికాలోనూ మరో కొత్త రీజినల్‌ రిఫైనరీ ప్రాజెక్టును తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నది ఆఫ్రికా. ఈ రిఫైనరీ ప్రారంభమైతే హిందూ మహా సముద్ర తీరంలో చమురును వెలికితీయడమే కాకుండా, స్వయంగా రిఫైరనీ చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది. గల్ఫ్ సంక్షోభం నేపథ్యంలో ఇరాన్ ఆర్థిక సాయం తగ్గితే, ఆఫ్రికాలో తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి రష్యా, టర్కీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆఫ్రికా సీఈఓ ఫోరమ్ ప్రతినిధి మేరీ కామరా విశ్లేషించినట్లుగా.. ఆఫ్రికా కాంటినెంటల్ మండలి ఎఎఫ్‌సీటీఏ ద్వారా అంతర్గత వాణిజ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇదొక సువర్ణావకాశం. ఆఫ్రికా దేశాలు కేవలం తాత్కాలిక ఉపశమన చర్యలతో ఆగకుండా, దీర్ఘకాలిక మౌలిక వసతులపై పెట్టుబడులు పెడితేనే అంతర్జాతీయ షాక్‌ల నుండి తమను తాము కాపాడుకోగలవు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story