Global Warming and Wars: అగ్ని గుండంలా మారుతున్న భూగోళం... భవిష్యత్ తరాలకు శాపం
ప్రపంచ యుద్ధాలు, అడవుల నరికివేత, కాలుష్యం, వాతావరణ మార్పులు భూమిని ఎలా అగ్నిగుండంలా మారుస్తున్నాయి? గ్లోబల్ వార్మింగ్ ప్రభావం, పర్యావరణ సంక్షోభం, భవిష్యత్ తరాలపై ఎలాంటి ముప్పు పొంచి ఉందో తెలుసుకుందాం.
Global Warming and Wars: వాతావరణం చల్లబడింది కదా...ఇప్పుడు అగ్నిగుండం ఏమిటని అనుకుంటే పొరపాటే. సూర్యుడి నుంచి వచ్చే కాంతి వలన భూమి వేడెక్కడం ఆ తరువాత సముద్రాల్లోని నీరు ఆవిరిగా మారి వర్షంగా మారడం సహజమే. కానీ, సహజత్వానికి విరుద్దంగా మనుషులు తమ సొంత లాభాల కోసం భూమిని విపరీతంగా వెడెక్కేలా చేస్తున్నారు. దీని వలన తాత్కాలికంగా మంచి జరగితే జరగొచ్చు. కానీ, దీర్ఘకాలంలో మంచి కంటే కూడా చెడే ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంటుంది. భవిష్యత్ తరాలకు శాపంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకు భూమి అగ్నిగుండంలా మారుతుంది. తెలుసుకుందాం.
జురాసిక్ యుగం నుంచి నేటి వరకు
మనిషి ఆవిర్భావం జరగక ముందు కాలానికి మనం వెళ్లాలి. జురాసిక్ యుగ్ంలో రాక్షస బల్లుల సంచారం ఉండేది. కానీ సహజత్వంగా ప్రకృతి వైపరిత్యాల కారణంగా ఆ జాతి అంతం కావడమే కాకుండా... కొత్త జాతుల ఆవిర్భావం జరిగింది. మనిషి ఆవిర్భవించిన తరువాత క్రమంగా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రకృతి సిద్ధంగా జరిగే మార్పులను కాదని సొంతంగా అసహజత్వంతో భూమిని వెడెక్కిస్తున్నాడు. ముఖ్యంగా ప్రకృతి సమతుల్యతకు అవసరమైన అడవులను నరికివేయడం ఒకత్తైతే... యుద్ధాలతో భూమిని మంటల్లో కాల్చివేయడం మరొకటి.
గత కొంతకాలంగా తీసుకుంటే ప్రపంచంలో భీకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు ఇజ్రాయిల్ పాలస్తీనా, ఇజ్రాయిల్ గాజా, ఇజ్రాయిల్ ఇరాన్, అమెరికా ఇరాన్, అమెరికా ఇరాక్, రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు మనిషి మనుగడపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నది. ఒకప్పుడు యుద్ధాలు రెండు వర్గాల మధ్య, రెండు రాజ్యాల మధ్య జరిగేది. ఆ సమయంలో కత్తులు లేదా ఫిరంగులు మాత్రమే ఉపయోగించేవారు. కానీ, ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ సహకారంతో భూమిని కాల్చేసే శక్తిగల ఆయుధాలతో యుద్ధాలు చేస్తున్నారు. ఇది ఒక విధంగా ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది. కూర్చున్న కొమ్మను నరుక్కునే సామెత మాదిరిగా చెప్పవచ్చు. ఇప్పటికే భౌగోళికంగా భీకరమైన మార్పులు వచ్చాయి. భూమి భారాన్ని తట్టుకోలేక భూకంపాలు సంభవిస్తున్నాయి. సునామీలు వస్తున్నాయి. మరోవైపు యుద్ధాల కారణంగా భయంకరమైన విస్పోటనాలు జరిగి ఒక్కసారిగా వేడి పెరిగిపోతున్నది.
భవిష్యత్ తరాలకు శాపం
మనం టెక్నాలజీతో భవిష్యత్‌ను నిర్మిస్తున్నామని అనుకుంటున్నాం. కానీ, భవిష్యత్ తరాలకు మనం అందించే ఈ టెక్నాలజీ శాపంగా మారే అవకాశం ఉంది. మనం మన మూలాలను మర్చిపోయి, మన పుట్టుకను మర్చిపోయి టెక్నాలజీతో ప్రకృతిని శాసించాలని చూస్తే అది మరింత ప్రమాదం. ప్రకృతి శక్తి ముందు మనిషి శక్తి నిరుపయోగం. ప్రతి దేశానికి రక్షణ అవసరమే. కానీ, ఆ రక్షణ పేరుతో మరణశాసనాన్ని మనమే రాసుకుంటే ఎలా. ప్రకృతి సిద్దమైన భవిష్యత్తును అందిస్తే అది మరో తరానికి ఆదర్శంగా మారుతుంది. అలా కాకుండా అగ్నిగోళాన్ని అందిస్తే... అందులో భవిష్యత్ తరాలు మగ్గిపోవడం తప్పించి మరో మార్గం ఉండదు.




