Ocean: రాత్రికి రాత్రే ఇంకిపోయిన సముద్రం.. తీరంలో అసలు ఏం జరిగింది..?
Ocean: అర్జెంటీనా తీరంలో అట్లాంటిక్ మహాసముద్రం 23 కిలోమీటర్లు వెనక్కి వెళ్లడంపై స్పందించిన సైంటిస్టులు.
Ocean: రాత్రికి రాత్రే ఇంకిపోయిన సముద్రం.. తీరంలో అసలు ఏం జరిగింది..?
Ocean: సోషల్ మీడియా తెరిస్తే చాలు.. రాత్రికి రాత్రే 23 కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లిపోయిన అట్లాంటిక్ మహాసముద్రం వీడియోలే కనిపిస్తున్నాయి. అర్జెంటీనా తీరంలో చోటుచేసుకున్న ఈ అరుదైన దృశ్యం చూసి నెటిజన్లు షాక్కు గురయ్యారు.
ఏ క్షణంలో ఏ భారీ సునామీ విరుచుకుపడుతుందోనని ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. అయితే, ఈ భయాలపై అర్జెంటీనా బీచ్ సైంటిస్టులు పూర్తి స్పష్టతనిచ్చారు.
అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ ప్రావిన్స్ పరిధిలోని మార్ డెల్ ప్లాటా తీరంలో సముద్ర నీరు ఊహించని విధంగా వెనక్కి తగ్గడం నిజమే. కానీ దాని వెనుక ఎలాంటి విపత్తు ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
నీరు అంతగా వెనక్కి వెళ్లిన కొద్దిసేపటికే మళ్లీ యథాస్థితికి వచ్చి చేరింది. సముద్రం ఇంకిపోవడానికి ప్రకృతి విపత్తు కారణం కాదని, ఇది ఒక సహజమైన వాతావరణ పరిణామమని నిపుణులు విశ్లేషించారు:
తీరం వైపు నుంచి సముద్రం వైపునకు నిరంతరంగా వీచే తీవ్రమైన బలమైన గాలుల వల్ల నీరు వెనక్కి నెట్టబడుతుంది. దీనిని వాతావరణ శాస్త్రంలో విండ్ సెట్ డౌన్ లేదా లో టైడ్ సైకిల్ అని పిలుస్తారు.
సునామీ అనేది సముద్ర గర్భంలో వచ్చే భూకంపాల వల్ల సంభవిస్తుంది. కానీ ఈ పరిణామం తుపాను, ఉప్పెన వంటి వాటికి పూర్తి భిన్నమైనది. అందుకే ఇది సునామీకి సంకేతమంటూ వస్తున్న వార్తలను ఎవరూ నమ్మవద్దని, వాతావరణంలో తాత్కాలికంగా వచ్చే ఆటుపోట్ల మార్పుల వల్లే ఇలా జరిగిందని సైంటిస్టులు ప్రజలకు ధైర్యం చెప్పారు.




