Bill Gates: క్రిప్టోపై బిల్ గేట్స్ సంచలన వ్యాఖ్యలు!

క్రిప్టోకరెన్సీపై మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఒక్క బిట్‌కాయిన్ కూడా ఎందుకు లేదో వివరిస్తూనే, వ్యాక్సిన్లలో మైక్రోచిప్‌ల వంటి కుట్రపూరిత సిద్ధాంతాలపై ఆయన స్పష్టతనిచ్చారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో చదవండి.

Ganesh
Published on: 16 March 2026 3:19 PM IST
Bill Gates: క్రిప్టోపై బిల్ గేట్స్ సంచలన వ్యాఖ్యలు!
X

Bill Gates: క్రిప్టోపై బిల్ గేట్స్ సంచలన వ్యాఖ్యలు!

Bill Gates: క్రిప్టోపై బిల్ గేట్స్ సంచలన వ్యాఖ్యలు!

ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ క్రేజ్ నడుస్తోంది. ఎలాన్ మాస్క్ వంటి దిగ్గజాలు దీనికి మద్దతు తెలుపుతుంటే, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మాత్రం పూర్తి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తనకు క్రిప్టోకరెన్సీపై నమ్మకం లేదని, అందుకే తాను అందులో పైసా కూడా పెట్టుబడి పెట్టలేదని స్పష్టం చేశారు.

వాల్యూ లేని పెట్టుబడి..

ఇటీవల రెడిట్ (Reddit) వేదికగా జరిగిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్‌లో పాల్గొన్న బిల్ గేట్స్.. క్రిప్టోకరెన్సీపై అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "నేను ఎలాంటి క్రిప్టో కరెన్సీని కలిగి లేను. సమాజానికి ఉపయోగపడే అవుట్‌పుట్ ఇచ్చే వాటిలో పెట్టుబడి పెట్టడమే నాకు ఇష్టం" అని పేర్కొన్నారు. కంపెనీల విలువ అవి తయారు చేసే అద్భుతమైన ఉత్పత్తులపై ఆధారపడి ఉంటుందని, కానీ క్రిప్టో విషయంలో కేవలం ఎదుటి వ్యక్తి దాని కోసం ఎంత చెల్లిస్తాడనే దానిపైనే ఆధారపడి ఉంటుందని గేట్స్ విశ్లేషించారు. క్రిప్టో వల్ల సమాజానికి కొత్తగా వరిగే ప్రయోజనం ఏమీ ఉండదని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు.

కుప్పకూలిన క్రిప్టో మార్కెట్..

బిల్ గేట్స్ ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే గత కొన్నాళ్లుగా బిట్‌కాయిన్, ఎథీరియం వంటి వర్చువల్ కరెన్సీలు భారీగా పతనమవుతున్నాయి. కేవలం ఒక నెలలోనే బిట్‌కాయిన్ 27 శాతం, ఎథీరియం 36 శాతం విలువను కోల్పోయాయి. ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ కూడా గతంలోనే క్రిప్టోపై ఇలాంటి ఆందోళనలనే వ్యక్తం చేశారు.

క్రిప్టోతో పాటు మరికొన్ని వివాదాస్పద అంశాలపై కూడా గేట్స్ స్పందించారు. వ్యాక్సిన్ల ద్వారా ప్రజల తలల్లో మైక్రోచిప్‌లు పెట్టి ట్రాక్ చేస్తున్నారనే కుట్రపూరిత సిద్ధాంతాలపై ఆయన నవ్వుతూ సమాధానమిచ్చారు. "వ్యాక్సిన్లలో చిప్స్ ఉండటం అనే ఆలోచనే అర్థరహితం. ప్రజలు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాల్సిన అవసరం నాకేంటి? ఆ సమాచారంతో నేను ఏం చేస్తాను?" అని ఆయన ప్రశ్నించారు. ధనవంతులపై పన్నులు పెంచాలా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. పన్నులు మరీ ఎక్కువగా ఉంటే, చాలామంది వాటి నుంచి తప్పించుకునే మార్గాలను వెతుక్కుంటారని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

Ganesh

Ganesh

Next Story