Vikarabad: జరీనా స్టోన్ క్రషర్ అక్రమాలపై నిరసన
Vikarabad: వికారాబాద్ జిల్లా అంతారంలో జరీనా క్రషర్ నిర్వాహకులు 4 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని ఉపసర్పంచ్ రవి, వార్డ్ మెంబర్ విజయేందర్ ఆరోపించారు.
Vikarabad: జరీనా స్టోన్ క్రషర్ అక్రమాలపై నిరసన
వికారాబాద్ జిల్లా: తాండూర్ మండల పరిధిలోని అంతారం గ్రామ శివారులో కొనసాగుతున్న జరీనా స్టోన్ క్రషర్ పేరుతో ఓ వ్యాపారి 4 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని క్రషర్ సామ్రాజ్యాన్ని విస్తారించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని అంతారం గ్రామ ఉపసర్పంచ్ వడ్డె రవి, వార్డ్ సభ్యుడు విజయేందర్ రెడ్డి లు గుర్తు చేశారు. బుధవారం గ్రామ శివారులో ఉన్న జరీనా స్టోన్ క్రషర్ ను సందర్శించి ఆ ప్రాంతంలో ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....
క్రషర్ మిషన్ సమీపంలో చెరువు కు ఆనుకొని ఉన్న తమ భూములకు వెళ్లే మార్గాన్ని కూడ ఆక్రమించుకోవడంతో తాము పంట పొలాలకు వెళ్లడం కష్టమవుతుందన్నారు. నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడం ఏమిటన్నారు. గ్రామపంచాయతీ ఆదాయానికి గండికొడుతూ ఇష్టారీతిన నడిపిస్తున్న క్రషర్ యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఇకనైనా ప్రభుత్వ అధికారులు మేల్కొని క్రషర్ మిషన్ యాజమాన్యంపై తగు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.




