Medipally: బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా యువకుల చేరిక!

Medipally: మేడిపల్లి, పీర్జాదిగూడ డివిజన్లకు చెందిన సుమారు 40 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

KARUNAKAR, UPPAL
Published on: 3 Aug 2026 8:48 AM IST
Medipally
X

Medipally: బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా యువకుల చేరిక!

Medipally: మల్కాజిగిరి నగరపాలక సంస్థ పరిధిలోని మేడిపల్లి, పీర్జాదిగూడ డివిజన్లకు చెందిన సుమారు 40 మంది యువకులు ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ కో-ఆప్షన్ సభ్యులు నాజియా జావిద్ ఖాన్ ఆధ్వర్యంలో పీర్జాదిగూడలోని పార్టీ కార్యాలయంలో మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు.

పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో యువతకు అనేక అవకాశాలు కల్పించగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టీ-హబ్ వంటి వేదికల ద్వారా ఆవిష్కరణలు, స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందించారని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని ఆరోపించారు. రైతులు, యువత, నిరుద్యోగులు, విద్యార్థుల్లో అసంతృప్తి నెలకొందని, దీంతో యువత మళ్లీ బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతోందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై కేటీఆర్ చేపడుతున్న పోరాటానికి మద్దతుగా యువత పెద్ద సంఖ్యలో పార్టీలో చేరుతోందని పేర్కొన్నారు.పార్టీలో చేరిన యువకులు తెలంగాణ అభివృద్ధి, యువత సంక్షేమం కోసం బీఆర్ఎస్‌తో కలిసి పనిచేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి, మాజీ కార్పొరేటర్లు కొల్తూరి మహేష్, మధుసూదన్ రెడ్డి, కౌడే పోచయ్య, మహిళా అధ్యక్షురాలు నిర్మల, మైనారిటీ అధ్యక్షుడు జిలాని పాషా, ఆకుల మధుకర్, శ్యామల శ్రీనివాస్, యాసారం శ్రీనివాస్, మునికుంట్ల కిరణ్ గౌడ్, పింగళి జోగిరెడ్డి, బుల్లెట్ శంకర్, ప్రవీణ్ రెడ్డి, వెంకట్,చిర్ర సంతోష్, సుభాన్, గోపాల్ రెడ్డి, పన్నాభాయ్, అమర్ పటేల్, అజ్హర్ అహ్మద్, సయ్యద్ అబ్రార్, సమీఉద్దీన్, అజ్హర్ ఖాన్, సయ్యద్ అర్బాజ్, సయ్యద్ ఇల్యాస్, మహ్మద్ పర్వేజ్ ఆలం, సొహైర్ హుస్సేన్, రహీమ్ ఖాన్, మహ్మద్ పాషా, సమీర్ ఖాన్, రేహాన్, షేక్సమీర్ హుస్సేన్, రియ్యాన్ హుస్సేన్, షఫీ హుస్సేన్, ఒగ్గు మధు, ఖలీక్ హుస్సేన్, షాకిర్ ఖాన్, సుఫియాన్ హుస్సేన్, తయ్యబ్ అన్సారీ, ఎం.డి. మూసా, జీషాన్, షహ్నవాజ్, సల్మాన్, ఫైజాన్, గణేష్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story