Hyderabad: సీనియర్ సిటిజన్లు తమ అనుభవాలను సమాజానికి పంచాలి: పెద్దిరెడ్డి పిలుపు!

Hyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ క్లబ్‌లో వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.

RAJESH,	WEST ZONE
Published on: 21 Aug 2026 6:12 PM IST
Hyderabad
X

Hyderabad: సీనియర్ సిటిజన్లు తమ అనుభవాలను సమాజానికి పంచాలి: పెద్దిరెడ్డి పిలుపు!

హైదరాబాద్: వయసు పెరిగుతున్నా కూడా సీనియర్‌ సిటిజన్స్‌ ఆత్మవిశ్వాసంతో సమాజంలో తిరగాలని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ క్లబ్‌ అద్యక్షుడు ఎనుగాల పెద్ది రెడ్డి అన్నారు. వరల్డ్‌ సీనియర్స్‌ సిటిజన్స్‌ డే వేడుకలను జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 10లోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ క్లబ్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా క్లబ్‌లో ఉన్న పలువురు సీనియర్‌ సిటిజన్‌ సభ్యులను వారు ఘనంగా సత్కరించారు. అనంతరం పెద్ది రెడ్డి మాట్లాడుతూ సీనియర్‌ సిటిజన్లు తమ అనుభవాలను, విజ్ఞానాన్ని అందించేందుకు ముందుకు రావాలని, వృద్ధుల పట్ల ప్రతి ఒక్కరు ప్రేమ, ఆప్యాయత చూపాలని కోరారు.

త్వరలోనే ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ క్లబ్‌లో సీనియర్‌ సిటిజన్ల కోసం పలు విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ జనరల్‌ సెక్రటరి రాగిడి లక్షా్మరెడ్డి, విజయ కో–ఆపరేటివ్‌ సొసైటీ ప్రెసిడెంట్‌ కొలను హన్మంతరెడ్డి, క్లబ్‌ మాజీ అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story