KPHB: కేపీహెచ్‌బీలో విషాదం.. ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య!
KPHB: హైదరాబాద్ కేపీహెచ్‌బీ 6వ ఫేజ్‌లోని పంచమతి అపార్ట్‌మెంట్‌లో విషాదం. ఐదో అంతస్తు నుంచి దూకి శీతల పురుషోత్తమన్ (30) ఆత్మహత్య. కేపీహెచ్‌బీ పోలీసుల దర్యాప్తు వివరాలు.
KPHB: కేపీహెచ్‌బీలో విషాదం.. ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య!
కూకట్ పల్లి: కెపిహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని 6వ ఫేజ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. పంచమతి అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న శీతల పురుషోత్తమన్ (30) ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
సీతా పురుషోత్తం తన భర్త, కుమార్తెతో కలిసి అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతూ మందులు వాడుతున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం అందింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు అపార్ట్‌మెంట్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డైనట్లు పోలీసులు గుర్తించారు.
సమాచారం అందుకున్న కెపిహెచ్‌బీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలింపు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న కేపీహెచ్బీ పోలీసులు.




