Ghatkesar: ఘట్‌కేసర్‌లో ఓటరు జాబితా సవరణపై సమీక్ష

Ghatkesar: ఘట్‌కేసర్ సర్కిల్‌లో ఓటరు జాబితా సవరణపై సమీక్షా సమావేశం. పారదర్శకమైన జాబితా సిద్ధం చేయాలని అధికారులకు డిప్యూటీ కమిషనర్ ఎ. వాణి ఆదేశం.

KARUNAKAR, UPPAL
Published on: 24 April 2026 6:17 PM IST
Ghatkesar
X

Ghatkesar: ఘట్‌కేసర్‌లో ఓటరు జాబితా సవరణపై సమీక్ష

Ghatkesar: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఘట్‌కేసర్ సర్కిల్ కార్యాలయంలో ఎలక్షన్‌కు సంబంధించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఘట్‌కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎ. వాణి, తహసీల్దార్ చంద్రశేఖర్, డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్ రెడ్డి, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు, బీఎల్ఓలు, సూపర్వైజర్లు, బూత్ లెవల్ ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్ కార్యక్రమం అమలు పురోగతి, ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన, ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల పేర్ల తొలగింపు, నకిలీ నమోదుల గుర్తింపు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. డిప్యూటీ కమిషనర్ ఎ. వాణి మాట్లాడుతూ ప్రతి బూత్ స్థాయిలో ఖచ్చితమైన, పారదర్శకమైన ఓటరు జాబితా సిద్ధం చేయడం అత్యంత ముఖ్యమని తెలిపారు. ఇంటింటి సర్వేలను సమగ్రంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని బూత్ లెవల్ ఆఫీసర్లకు సూచించారు.

ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. తహసీల్దార్ చంద్రశేఖర్, డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్ రెడ్డి లు, పనుల పురోగతిని సమీక్షించి అవసరమైన సూచనలు అందించారు. ఘట్‌కేసర్, నాగారం, ఏదులాబాద్, పోచారం వార్డుల వారీగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఏఎంసీలు వేణుగోపాల్ రెడ్డి, శశి కుమార్, సతీష్ సూచించారు. సూపర్వైజర్లు తమ పరిధిలోని బూత్ లెవల్ ఆఫీసర్ల పనిని నిరంతరం పర్యవేక్షిస్తూ లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story