Vikarabad: వికారాబాద్ వైష్ణవి పాఠశాలలో ఘనంగా బోనాల సంబరాలు

Vikarabad: వికారాబాద్ వైష్ణవి పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ. విద్యార్థుల బోనాల శోభాయాత్ర, పోతరాజుల విన్యాసాలు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన విద్యార్థులు.

MOGULAIAH, VIKARABAD
Published on: 8 Aug 2026 7:43 PM IST
Vikarabad
X

Vikarabad: వికారాబాద్ వైష్ణవి పాఠశాలలో ఘనంగా బోనాల సంబరాలు

వికారాబాద్: జిల్లా కేంద్రంలోని వైష్ణవి పాఠశాలలో బోనాల సంబరాలను ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యమైన బోనాలను విద్యార్థులు భక్తిశ్రద్ధలతో తయారు చేసి సమర్పించారు.

ఈ సందర్భంగా పాఠశాల నుంచి విద్యార్థులు బోనాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయం వరకు తరలివెళ్లారు. డప్పు దరువులు, పోతరాజుల విన్యాసాలతో శోభాయాత్ర ఉత్సాహభరితంగా సాగింది. విద్యార్థులు భక్తిశ్రద్ధలతో అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి బోనాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు.

విద్యార్థుల బోనాల శోభాయాత్రను కాలనీవాసులు ఆసక్తిగా వీక్షించి ఆనందించారు. విద్యార్థులు ఆటపాటలతో ఉత్సాహంగా పాల్గొని బోనాల సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాల్గొని పిల్లలను ప్రోత్సహిస్తూ సంబరాల్లో భాగస్వాములయ్యారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story