Vikarabad: వికారాబాద్‌లో యాంటీ డ్రగ్స్ 2K రన్.. జెండా ఊపిన స్పీకర్ గడ్డం

Vikarabad: వికారాబాద్ జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఘనంగా 2K రన్.

MOGULAIAH, VIKARABAD
Published on: 26 Jun 2026 1:55 PM IST
Vikarabad
X

Vikarabad: వికారాబాద్‌లో యాంటీ డ్రగ్స్ 2K రన్.. జెండా ఊపిన స్పీకర్ గడ్డం

Vikarabad: మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబాలు, సమాజం, దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలంగాణా రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.

శుక్రవారము అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్ పి ఆధ్వర్యంలో 2K రన్ మరియు అవగాహన సమావేశం వికారాబాద్ జిల్లా బ్లాక్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించబడింది.

ఈ సందర్బంగా స్పీకర్ మాట్లాడుతూ

డ్రగ్స్ అనేది ఒక మహమ్మారి, సరదాగా మొదలయ్యి, వ్యసనంగా మారి జీవితాలను సర్వనాశనం చేస్తుంది. ముఖ్యంగా బంగారు భవిష్యత్తు ఉన్న యువత సాలెగూడు లాంటి డ్రగ్స్ ఊబిలో చిక్కుకొని తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు.

ఇంట్లో ఒక్కరు డ్రగ్స్ కు బానిసలు అయితే ఆ వ్యక్తితో పాటుగా ఆ కుటుంబం కూడా నాశనం అవుతుంది, చిన్నాభిన్నం అవుతుంది. ఆర్ధికంగా అప్పులపాలు అవ్వడంతో పాటుగా అనారోగ్యాల పాలవుతారు. డ్రగ్స్ అలవాటు ఉన్న వ్యక్తులకు సమాజంలో గౌరవం ఉండదు. ఏ విదంగా చూసినా మాదకద్రవ్యాలతో అన్ని నష్టాలు ఉంటాయి. అందుకే అందరు కూడా వాటికి దూరంగా ఉండాలి.

మనకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్ వాడుతుంటే వారికి అవగాహన కల్పించే బాద్యత మన అందరి పై ఉందన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ 2K రన్‌ను జెండా ఊపి ప్రారంభించి,బ్లాక్ గ్రౌండ్ నుండి ఏం ఆర్ పి చౌరస్తా వరకు 2 k రన్ నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తి, కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.

యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, విద్యాసంస్థలు మరియు సంబంధిత శాఖలు సమన్వయంతో అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని సూచించారు.

కార్యక్రమంలో జిల్లా ఎస్ పి స్నేహ మెహర, అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ ,అధికారులు మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై వివరించి, వాటి నివారణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను తెలియజేశారు. ఈ సందర్బంగా నిన్న నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన వారికీ బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో SP స్నేహా మెహ్రా, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ఉమా శంకర్ ప్రసాద్, ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజు గూటూరు, మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య, వైస చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి, AMC చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్, మున్సిపల్ కమిషనర్ విక్రం సింహా రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలుపాల్గొన్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story