Vikarabad: మత్తు, నేర రహిత వికారాబాద్ కోసం పోలీసుల ప్రత్యేక డ్రైవ్!
Vikarabad: వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాలతో మత్తు పదార్థాల నిర్మూలన నేరాల నియంత్రణకు పోలీసుల ప్రత్యేక డ్రైవ్ నార్కోటిక్ కిట్లతో తనిఖీలు.
Vikarabad: మత్తు, నేర రహిత వికారాబాద్ కోసం పోలీసుల ప్రత్యేక డ్రైవ్!
వికారాబాద్
మత్తు పదార్థాల నిర్మూలనతో పాటు నేరాల నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్
– జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS
వికారాబాద్ జిల్లాను మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్-డివిజన్ల పరిధిలోని సమస్యాత్మక, ఏకాంత ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విద్యాసంస్థల పరిసర ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాల్లో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS మాట్లాడుతూ,
సమాజానికి ముఖ్యంగా యువత భవిష్యత్తుకు ముప్పుగా మారుతున్న గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల విక్రయం, రవాణా, నిల్వ, వినియోగంపై వికారాబాద్ జిల్లా పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
మత్తు పదార్థాల సరఫరాదారులు, విక్రేతలు, వినియోగదారులపై నిరంతరం నిఘా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా వికారాబాద్, తాండూరు, పరిగి సబ్-డివిజన్లలో నార్కోటిక్ డిటెక్షన్ కిట్లతో అనుమానితులను తనిఖీ చేయడంతో పాటు ఫుట్ పెట్రోలింగ్, వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.
ప్రజలు, విద్యార్థులు, ప్రయాణికులకు మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.
అదేవిధంగా దొంగతనాలు, అక్రమ కార్యకలాపాలు, రాత్రి వేళల్లో జరిగే నేరాలను అరికట్టేందుకు సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా, రాత్రి గస్తీ, వాహన తనిఖీలు మరియు అనుమానితుల తనిఖీలు ముమ్మరం చేసినట్లు ఎస్పీ గారు తెలిపారు.
గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల విక్రయం, రవాణా, వినియోగం, దొంగతనాలు లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులకు లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్‌కు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మత్తు రహిత, నేర రహిత వికారాబాద్ నిర్మాణంలో ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ డీఎస్పీ అంజయ్య, తాండూరు డీఎస్పీ యాదయ్య, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు, ఎస్‌ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




