Vikarabad: సైబర్ నేరాల నియంత్రణలో ప్రత్యేక దృష్టి వికారాబాద్ ఎస్పీ

Vikarabad: వికారాబాద్ జిల్లాలో సైబర్ నేరాల నియంత్రణపై ఎస్పీ స్నేహ మెహ్రా సమీక్ష. మ్యూల్ ఖాతాలపై నిఘా, ఈ-జీరో ఎఫ్‌ఐఆర్ అమలుకు ఆదేశం.

MOGULAIAH, VIKARABAD
Published on: 23 July 2026 7:32 PM IST
Vikarabad
X

Vikarabad: సైబర్ నేరాల నియంత్రణలో ప్రత్యేక దృష్టి వికారాబాద్ ఎస్పీ

వికారాబాద్: తెలంగాణ రాష్ట్ర గౌరవ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) ఆధ్వర్యంలో సైబర్ నేరాల నియంత్రణ, దర్యాప్తు పురోగతి, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి *స్నేహ మెహ్రా, IPS* జిల్లా అదనపు ఎస్పీ *రాజేశ్ మీనా, IPS*, జిల్లా సైబర్ క్రైమ్, సోషల్ మీడియా, ఐటీ సెల్ అధికారులతో కలిసి పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS జిల్లా అధికారులతో మాట్లాడుతూ, జిల్లాలో సైబర్ నేరాల నియంత్రణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో సైబర్ క్రైమ్ వ్యవహారాలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ, అందిన ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి బాధితులకు సత్వర సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

సైబర్ నేరాల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని, *e-Zero FIR* విధానాన్ని సమర్థంగా అమలు చేయడంతో పాటు ప్రతి పోలీస్ స్టేషన్‌లో *Cyber Crime Vertical* పనితీరును బలోపేతం చేయాలని తెలిపారు. *Cyber Crime KPIsను నిరంతరం పర్యవేక్షిస్తూ, **Cyber Support Bureau (CSB)* ద్వారా లభించే దర్యాప్తు సహాయాన్ని పూర్తి స్థాయిలో వినియోగించాలని సూచించారు.

అలాగే *CCTNS* మరియు ఇతర ఆన్‌లైన్ పోర్టల్స్‌లో కేసుల వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలని, నెలవారీ సమీక్షల ద్వారా పెండింగ్ కేసుల పురోగతిని పరిశీలించాలని, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ప్రత్యేక సైబర్ ఆపరేషన్లలో సమన్వయంతో పాల్గొనాలని ఆదేశించారు. సైబర్ నేరాల దర్యాప్తు నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు పోలీసు అధికారులు, సిబ్బందికి నిరంతర శిక్షణ నిర్వహించాలని పేర్కొన్నారు.

మ్యూల్ బ్యాంక్ ఖాతాలు (Mule Bank Accounts), అనుమానాస్పద బ్యాంకింగ్ లావాదేవీలు, ఆన్‌లైన్ మోసాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక నిఘా ఉంచి, నిందితులను వేగంగా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే *"సైబర్ జాగ్రూక్త దివస్"* కార్యక్రమాన్ని జిల్లాలో విస్తృతంగా నిర్వహించాలని ఎస్పీ గారు ఆదేశించారు.

Cyber Warriors, VPOలు, విద్యాసంస్థల సహకారంతో ప్రజలకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలు OTP, CVV, UPI PIN, బ్యాంకు వివరాలు ఎవరికీ తెలియజేయవద్దని, అనుమానాస్పద లింకులు, QR కోడ్‌లు, పెట్టుబడి మోసాలు, డిజిటల్ అరెస్ట్, పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా National Cyber Crime Portalలో ఫిర్యాదు చేయాలని సూచించారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story