Vikarabad: తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో రాఘవాపూర్ నేతకు రజతం
Vikarabad: వికారాబాద్ జిల్లా యాలాల మండలం రాఘవాపూర్ మాజీ ఉపసర్పంచ్ నరసింహులు జాతీయ తైక్వాండో పోటీల్లో రజత పతకం సాధించడం పట్ల అభినందించిన తాండూరు డీఎస్పీ.
Vikarabad: తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో రాఘవాపూర్ నేతకు రజతం
వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గ యాలాల మండల పరిధిలోని రాఘవాపూర్ మాజీ ఉపసర్పంచ్ ఐదవ జాతీయ తైక్వాండో పూమ్సే నేషనల్ ఛాంపియన్ షిప్ పోటీలలో రజిత పథకాన్ని రాఘవపూర్ మాజీ ఉపసర్పంచ్ నరసింహులు సాధించడం గర్వకారణమని తాండూరు డిఎస్పి నర్సింగ్ యాదయ్య అన్నారు.
శనివారం పథకాన్ని అవార్డింగ్ చేసిన అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 8 నుండి 11వ తేదీ వరకు పోనీలో జరిగిన శాంపియన్షిప్ లో తెలంగాణ నుండి అండర్ 40 విభాగంలో నర్సింలు పథకాన్ని సాధించడం ఆనందంగా ఉందన్నారు.
యువత శారీరక దృఢత్వంతో పాటు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కోచింగ్ అందించిన మాస్టర్స్ గోపాలకృష్ణ , రవి లను ఈ సందర్భంగా అభినందించారు. నూతనంగా బ్లాక్ బెల్ట్ సాధించిన తాండూరు పట్టణానికి చెందిన రేవతికి బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్ డిఎస్పి నర్సింగ్ యాదయ్య అందజేశారు.




