Vikarabad: వికారాబాద్‌లో శిలాఫలకం ద్వితీయ వార్షికోత్సవం

Vikarabad: వికారాబాద్‌లో గెస్ట్ హౌస్ నిర్మాణం పూర్తికాక రెండేళ్లయిన సందర్భంగా శిలాఫలకానికి పూజలు చేసి నిరసన తెలిపిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్.

MOGULAIAH, VIKARABAD
Published on: 5 Aug 2026 4:03 PM IST
Vikarabad
X

Vikarabad: వికారాబాద్‌లో శిలాఫలకం ద్వితీయ వార్షికోత్సవం

వికారాబాద్: ఈరోజుతో శిలాఫలకం రెండు సంవత్సరాలు పూర్తి అయినా సందర్భంగా పూలమాల వేసి, అగర్బత్తీలు వెలిగించి, టెంకాయ కొట్టి, పూలు చల్లి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ పట్టణంలో నాలుగు సూట్ల గెస్ట్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి నేటికి సరిగ్గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, పూర్తికాని నిర్మాణానికి ప్రతీకగా శిలాఫలకం వద్ద ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ, ప్రజలకు ఉపయోగపడాల్సిన నాలుగు సూట్ల గెస్ట్ హౌస్ నిర్మాణం రెండేళ్లు గడిచినా పూర్తి కాకపోవడం ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.

ప్రజలకు ఇచ్చిన హామీలు కేవలం శిలాఫలకాలకే పరిమితం కావద్దని, ప్రస్తుత ఎమ్మెల్యే, స్పీకర్ గారు వెంటనే స్పందించి గెస్ట్ హౌస్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రధాన అంశాలు

* రెండేళ్లు పూర్తయినా గెస్ట్ హౌస్ నిర్మాణం పూర్తి కాలేదు.

* ప్రజల సొమ్ముతో ప్రారంభించిన పనులు మధ్యలోనే నిలిచిపోయాయి.

* ప్రస్తుత ఎమ్మెల్యే, స్పీకర్ గారు వెంటనే నిర్మాణాన్ని పూర్తి చేయాలి.

* ప్రజలకు ఇచ్చిన హామీలను ఆచరణలో చూపించాలని డాక్టర్ మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story