Vikarabad: వికారాబాద్‌లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పరిశీలన
Vikarabad: వికారాబాద్‌లో నిలిచిపోయిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్. రైతు సమస్యలపై అధికారులతో చర్చ.
Vikarabad: వికారాబాద్‌లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పరిశీలన
వికారాబాద్: ఆగిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్... రైతుల కష్టాలు ఆగేది ఎప్పుడు? డాక్టర్ మెతుకు ఆనంద్.. ఈరోజు వికారాబాద్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాన్ని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు సందర్శించి, అక్కడి రైతులు మరియు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు.
రైతుల ఆవేదనను విన్న అనంతరం, వెంటనే మార్కెట్ సెక్రటరీకి ఫోన్ చేసి సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రధాన సమస్యలు:
🔸 రైతులకు తాగునీటి సౌకర్యం లేకపోవడం.
🔸 మరుగుదొడ్ల నిర్మాణం చేయాలి.
🔸 కోట్ల రూపాయలతో ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనం నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడం.
🔸 మార్కెట్ పరిసరాల్లో చెత్తను సకాలంలో తొలగించకపోవడం.
🔸 మార్కెట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు సకాలంలో అందకపోవడం.
రైతులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి, నిలిచిపోయిన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని, ఉద్యోగులకు బకాయి జీతాలు చెల్లించాలని డాక్టర్ మెతుకు ఆనంద్ గారు అధికారులను డిమాండ్ చేశారు. "రైతు సంక్షేమమే నిజమైన అభివృద్ధికి పునాది. రైతుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతాం."




