Vikarabad: గణేష్ ఉత్సవాల భద్రతపై డీజీపీ సీవీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్
Vikarabad: గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లపై డీజీపీ సీవీ ఆనంద్ ఇచ్చిన మార్గదర్శకాలపై వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా పోలీసు అధికారులతో సమీక్షించారు.
Vikarabad: గణేష్ ఉత్సవాల భద్రతపై డీజీపీ సీవీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్
వికారాబాద్: గణేష్ ఉత్సవాలు–2026 సందర్భంగా భద్రతా, బందోబస్తు ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర గౌరవ డీజీపీ శ్రీ సీవీ ఆనంద్, IPS ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా చేపట్టాల్సిన ముందస్తు భద్రతా చర్యలపై డీజీపీ పోలీస్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
గణేష్ మండపాలు, నిర్వాహకులు, వాహనాలు, సీసీ కెమెరాలు, నిమజ్జన రూట్ల వివరాలను www.policeportal.tspolice.gov.in పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా Intimationగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రతి గణేష్ మండపాన్ని పోలీసులు క్రమం తప్పకుండా సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించాలని, సున్నితమైన ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. నిమజ్జన రూట్లను ముందుగానే పరిశీలించి ట్రాఫిక్ నియంత్రణ, బారికేడింగ్, పార్కింగ్, రూట్ డైవర్షన్ వంటి ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.
అలాగే గణేష్ ఉత్సవాల నిర్వాహకులతో సమన్వయం చేసుకుని నిబంధనలు, భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించాలని, సోషల్ మీడియాలో వ్యాప్తి చెందే వదంతులు, తప్పుడు సమాచారంపై ప్రత్యేక నిఘా ఉంచాలని డీజీపీ గారు సూచించారు.
ప్రజల సహకారంతో గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని డీజీపీ గారు పోలీస్ అధికారులను ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS గారితో పాటు జిల్లా అదనపు ఎస్పీ శ్రీ రాజేష్ మీనా, IPS, జిల్లాలోని పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




