Vikarabad: కాంగ్రెస్ వెయ్యి రోజుల వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరభేరి

Vikarabad: వికారాబాద్‌లో కాంగ్రెస్ వెయ్యి రోజుల వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరభేరి నిర్వహించింది. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు.

MOGULAIAH, VIKARABAD
Published on: 2 Sept 2026 10:53 PM IST
Vikarabad
X

Vikarabad: కాంగ్రెస్ వెయ్యి రోజుల వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరభేరి

వికారాబాద్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ ఆదేశాల మేరకు, కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వికారాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ సమరభేరి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది.

బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో న్యూ గంజ్ నుంచి NTR చౌరస్తా వరకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించాం.

ఈ సందర్భంగా డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ:

“ఊహల పల్లకిలో ఊపుతున్న రేవంత్ రెడ్డి... బట్టి మాటలన్నీ వట్టి మాటలే!”

ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు వెయ్యి రోజులు గడిచినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైంది.

“ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటది... ఏడవ గ్యారంటీ నేనిస్తున్నా — అదే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుడు” అని చెప్పిన రేవంత్ రెడ్డి , ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా నిరసన ర్యాలీ నిర్వహించేందుకు సైతం అనుమతి ఇవ్వకపోతే ఇంకెక్కడ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారు? అని డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రశ్నించారు.

ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ అయినా పూర్తిగా అమలు చేశారా?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు మిగిలింది హామీల మోసం, నిరాశ, నిర్లక్ష్యమే. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తాం...* ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతాం... *ప్రజల పక్షాన బీఆర్ఎస్ ఉద్యమం కొనసాగిస్తాం!

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story