Vikarabad: అసెంబ్లీ గేటు వద్ద పోలీసుల ఓవరాక్షన్.. చైతన్య కిరణ్ ఫైర్!

Vikarabad: అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల దౌర్జన్యం, అక్రమ అరెస్టులను వికారాబాద్ బీఆర్‌ఎస్ నేత ఎం. చైతన్య కిరణ్ తీవ్రంగా ఖండించారు.

MOGULAIAH, VIKARABAD
Published on: 7 Sept 2026 3:52 PM IST
Vikarabad
X

Vikarabad: అసెంబ్లీ గేటు వద్ద పోలీసుల ఓవరాక్షన్.. చైతన్య కిరణ్ ఫైర్!

వికారాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల విఫల పాలనకు వ్యతిరేకంగా గన్ పార్క్ నుండి అసెంబ్లీకి నిరసనగా వెళ్తున్న బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులపై పోలీసులు జరిపిన దౌర్జన్యాన్ని, అక్రమ అరెస్టులను బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, బీఆర్‌ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్, యువ చైతన్య ట్రస్ట్ చైర్మన్ యం. చైతన్య కిరణ్ తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారి పట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి, ఆమె చీర లాగి తీవ్రంగా అవమానించడం కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకత్వానికి నిదర్శనం.

ప్రజాస్వామ్యబద్ధంగా నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీ గేట్ వద్దే అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గం.

ప్రజాసమస్యలపై ప్రశ్నించే ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై వికారాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

– యం. చైతన్య కిరణ్

బీఆర్‌ఎస్ నాయకులు

చైర్మన్, యువ చైతన్య ట్రస్ట్ (వికారాబాద్)

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story