Vikarabad: డ్రగ్స్, సైబర్ భద్రతపై అవగాహన.. క్రీడా పోటీలు ప్రారంభం!

Vikarabad: వికారాబాద్‌ను మాదకద్రవ్య రహిత జిల్లాగా మారుస్తామని కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహర స్పష్టం చేశారు. డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు.

MOGULAIAH, VIKARABAD
Published on: 25 Jun 2026 5:59 PM IST
Vikarabad
X

Vikarabad: డ్రగ్స్, సైబర్ భద్రతపై అవగాహన.. క్రీడా పోటీలు ప్రారంభం!

వికారాబాద్: మాదకద్రవ్య రహిత జిల్లాగా వికారాబాద్ జిల్లాను తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా ఎస్ పి స్నేహ మెహర అన్నారు. వికారాబాద్ జిల్లాల్లో బ్లాక్ గ్రౌండ్ లో డ్రగ్స్ నివారణ మరియు సైబర్ భద్రత పై అవగాహన కార్యక్రమంతో పాటు క్రీడా పోటీలను నిర్వహించారు.

యువతలో ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రీడాస్ఫూర్తి పెంపొందించడంతో పాటు డ్రగ్స్ నివారణ మరియు సైబర్ భద్రతపై అవగాహన కల్పించే లక్ష్యంతో నిర్వహించిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యువత క్రీడల వైపు మళ్లడం ద్వారా శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవడంతో పాటు మాదకద్రవ్యాల వంటి సామాజిక దురాచారాలకు దూరంగా ఉండగలరని అన్నారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం మరియు జట్టుగా పనిచేసే నైపుణ్యాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

అదేవిధంగా డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలు, సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించారు. ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ మరియు ఎస్‌పీ జ్యోతి ప్రజ్వలన చేసి, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పోటీలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అభినందించి, క్రీడా రంగంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలోట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టుర్, ఈషా హాస్పిటల్ డైరెక్టర్ భరత్ రెడ్డి,డి ఎస్ పి అంజయ్య, స్పోర్ట్స్ అధికారి సత్తార్, మున్సిపల్ కమిషనర్ విక్రమ సింహ రెడ్డి, తహసిల్దార్ లక్ష్మి నారాయణ , వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, క్రీడాకారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story