Vikarabad: తాండూరు తహసిల్దార్‌ను బర్తరఫ్ చేయాలి ఠాగూర్ సూరజ్ సింగ్
Vikarabad: వికారాబాద్ జిల్లా తాండూరులో తప్పుడు పత్రాలు సృష్టించిన తహసిల్దార్ తారాసింగ్‌ను ఉద్యోగం నుండి బర్తరఫ్ చేయాలని జనసత్తా ఆర్గనైజేషన్ డిమాండ్.
Vikarabad: తాండూరు తహసిల్దార్‌ను బర్తరఫ్ చేయాలి ఠాగూర్ సూరజ్ సింగ్
వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూరు మండలం చెంగోలు గ్రామం లోని సర్వే నెంబర్లు 200, 212, 141, 142, 143 ల లోని 11 ఎకరాల 8 గంటల భూమికి తప్పుడు పత్రాలు సృష్టించి కొందరిని వారసులుగా ధృవీకరించి వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్న తహసిల్దార్ తారాసింగ్ ను వెంటనే ఉద్యోగం నుండి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని జనసత్తా వెల్ఫేర్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షులు ఠాగూర్ సూరజ్ సింగ్ బుధవారం డిమాండ్ చేశారు.
విధి నిర్వహణలో చట్టాన్ని చుట్టంగా చేసుకొని నిబంధనలకు వ్యతిరేకంగా, ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తప్పుడు పత్రాలు సృష్టించిన ఎమ్మార్వో పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, సీసీఎల్ఏ కమిషనర్ కు విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. మూడు సంవత్సరాల నుండి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అక్రమ సంపాదనకు తాహసిల్దార్ తెర దీశారన్నారు. భవిష్యత్తులో ఏసీబీ సహాయాన్ని తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్తానన్నారు.




