Malkajgiri: మల్కాజిగిరిలో ఘనంగా విహెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం!
Malkajgiri: మల్కాజిగిరిలో విహెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వికలాంగుల పింఛను పెంపు, రిజర్వేషన్లపై నాయకులు లక్ష్మణ్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Malkajgiri: మల్కాజిగిరిలో ఘనంగా విహెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం!
Malkajgiri: వికలాంగులకు ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఇంచార్జ్ తిప్పారపు లక్ష్మణ్ మాదిగ డిమాండ్ చేశారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజిగిరి చౌరస్తాలో విహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు వినయ్ మాదిగ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తిప్పారపు లక్ష్మణ్ మాదిగ,ఎం.జె.ఎఫ్ రాష్ట్ర నాయకులు మనోహర్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ మాదిగ, వినయ్ మాదిగ మాట్లాడుతూ వికలాంగుల హక్కుల కోసం మందకృష్ణ మాదిగ 19 ఏళ్ల క్రితం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఉద్యమాన్ని నిర్మించారని తెలిపారు. ఆ ఉద్యమం ద్వారా వికలాంగులకు అనేక హక్కులు, ప్రయోజనాలు సాధించామని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వికలాంగుల పెన్షన్‌ను పెంచి అందించాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చట్టసభలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్న విధంగానే వికలాంగులకు కూడా వారి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. వికలాంగులకు దక్కాల్సిన హక్కులు, వాటా సాధించే వరకు భవిష్యత్తులోనూ ఉద్యమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ కుమార్,బి రజిత,ఎం వెంకటేష్ బి నరసింహ,ఈశ్వరయ్య, అజిరా బేగం,సూరజ్, ప్రకాష్,ఎస్ కీర్తి, తదితరులు పాల్గొన్నారు.




