Uppal: బైక్ రేసులతో బీభత్సం.. వణికిపోతున్న స్థానికులు

Uppal: ఉప్పల్ భగాయత్ ఫేజ్-2లో హద్దు మీరుతున్న ఆకతాయిల ఆగడాలు. వాసవి మెట్రోపోలిస్ సమీపంలో బైక్ రేసులు, గంజాయి ముఠాల సంచారం.

KARUNAKAR, UPPAL
Published on: 24 April 2026 8:53 PM IST
Uppal
X

Uppal: బైక్ రేసులతో బీభత్సం.. వణికిపోతున్న స్థానికులు

Uppal: ఉప్పల్ భగాయత్ ఫేజ్–2లో డీమార్ట్ పక్కన ఉన్న వాసవి మెట్రోపోలిస్ గేటెడ్ కమ్యూనిటీ సమీప రహదారిపై ఆకతాయిల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం పట్టపగలే కొందరు యువకులు బైక్ రేసులు నిర్వహిస్తూ రోడ్డుపై వెళ్తున్న ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారు. ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

ఇదే ప్రాంతంలో సరైన వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. గంజాయి సేవించే గుంపులు విచ్చలవిడిగా తిరుగుతుండటంతో మహిళలు, వృద్ధులు బయటకు రావడానికి భయపడుతున్నారు. రోడ్ల పక్కన ఉన్న ఖాళీ ప్రదేశాలు చీకటిలో అక్రమ కార్యకలాపాలకు కేంద్రాలుగా మారుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. యువతీ యువకులు అక్కడ ఏకాంతంగా సంచరిస్తూ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు.

ఈ పరిస్థితులకు తోడు బైక్ రేసుల పేరుతో వేగంగా వెళ్లే వాహనాలు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. అయితే, ఈ అంశంపై పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అపార్ట్‌మెంట్ వాసులు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తక్షణమే పోలీసులు చర్యలు తీసుకుని రాత్రి పహారా పెంచాలని, వీధిదీపాలు ఏర్పాటు చేయాలని, ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story