Hayathnagar: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: సర్పంచ్!
Hayathnagar: హయత్‌నగర్ పరిధిలో వనమహోత్సవం సందర్భంగా సర్పంచ్ పబ్బత్ బాలకిషన్ గౌడ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.
Hayathnagar: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: సర్పంచ్!
హయత్ నగర్: వనమహోత్సవంలో భాగంగా గ్రామ సర్పంచ్ పబ్బత్ బాలకిషన్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామాన్ని పచ్చదనంతో నింపేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఈ సందర్భంగా సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సద్దిపల్లి శిరీష శంకర్ రెడ్డి, వార్డు సభ్యులు ఆకిటి రామకృష్ణారెడ్డి, బండారి సత్యనారాయణ, రాపోలు మల్లేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి సునీతతో పాటు ఉపాధి హామీ కూలీలు పాల్గొని మొక్కలు నాటారు. గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని గ్రామ పంచాయతీ ప్రతినిధులు తెలిపారు.
Next Story




