Vampuguda: మైత్రి ఎంక్లేవ్‌లో సమస్యలను పరిశీలించిన స్వర్ణరాజ్ శివమణి

Vampuguda: వంపుగూడ డివిజన్ మైత్రి ఎంక్లేవ్ కాలనీలో పర్యటించిన మాజీ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ.

ASHOK, KAPRA
Published on: 13 Aug 2026 4:28 PM IST
Vampuguda
X

Vampuguda: మైత్రి ఎంక్లేవ్‌లో సమస్యలను పరిశీలించిన స్వర్ణరాజ్ శివమణి

వంపుగూడ: వంపుగూడ డివిజన్ మైత్రి ఎంక్లేవ్ ఎక్స్‌టెన్షన్ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధుల ఆహ్వానం మేరకు కాప్రా డివిజన్ మాజీ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి కాలనీలో పర్యటించారు.

ఈ సందర్భంగా కాలనీలోని అంతర్గత రోడ్ల నిర్మాణం, బాక్స్ డ్రైన్ నిర్మాణం చేపట్టాల్సిన ఆవశ్యకతను కాలనీ వాసులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను పరిశీలించిన స్వర్ణరాజ్ శివమణి సంబంధిత అధికారులకు వివరాలను తెలియజేసి, సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టడంతో పాటు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

కాలనీ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తన వంతు సహకారం అందిస్తానని ఆయన తెలిపారు. ఈ పర్యటనలో వంపుగూడ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు అనూప్ రాజ్ (టిల్లు) యాదవ్, జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ దండ్ల మురళీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పి. పవన్ కుమార్, ప్రదీప్, వినయ్, అలీ, సద్దాం తదితరులతో పాటు మైత్రి ఎంక్లేవ్ ఎక్స్‌టెన్షన్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA

Next Story