Boduppal: ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ చారిత్రాత్మకం.. నీట్ లీక్‌పై కేంద్రం సమాధానం చెప్పాలి!

Boduppal: బోడుప్పల్‌లో కాంగ్రెస్ నేత తోటకూర వజ్రేష్ యాదవ్ మీడియా సమావేశం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌పై ప్రశంసలు, నీట్ పేపర్ లీక్‌పై కేంద్రంపై ధ్వజం.

KARUNAKAR, UPPAL
Published on: 25 Jun 2026 4:46 PM IST
Boduppal
X

Boduppal: ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ చారిత్రాత్మకం.. నీట్ లీక్‌పై కేంద్రం సమాధానం చెప్పాలి!

బోడుప్పల్: తెలంగాణలో విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక చర్యలు చేపడుతోందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.

మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమవుతున్న ఈ పాఠశాలలు విద్యార్థులకు ఆధునిక సదుపాయాలు, మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పిస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న విద్యా అసమానతలను తొలగించి, ప్రభుత్వ విద్యపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని వజ్రేష్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. కోట్లాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తును పణంగా పెట్టి పరీక్షలకు సిద్ధమవుతుంటే, ప్రశ్నపత్రాల లీకేజీలతో వారి కష్టాన్ని నీరుగార్చడం దారుణమన్నారు. ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని, దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అలాగే స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కు అని, దానిని హరించే హక్కు ఎవరికీ లేదన్నారు. సర్వే ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలు, నాయకులు ప్రజలకు అండగా నిలిచి ప్రతి ఓటరుకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా ఆర్టీఏ సభ్యుడు జైపాల్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఏనుగు జలంధర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు షేరీ సతీష్ రెడ్డి, ముప్పు రామారావు, మాజీ మున్సిపల్ చైర్మన్లు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఘట్‌కేసర్ మండల అధ్యక్షుడు కర్రే రాజేష్, గుండ్లపోచంపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ సాయిపేట శ్రీనివాస్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story