Kadtal: పెద్దమ్మ తల్లి ధ్వజస్తంభ ప్రతిష్టకు ఉప్పల వెంకటేష్ గుప్తాకు ఆహ్వానం!
Kadtal: కడ్తాల్ శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ ధ్వజస్తంభ ప్రతిష్టోత్సవానికి రావాలని ఉప్పల వెంకటేష్ గుప్తాకు ఆహ్వాన పత్రిక అందజేసిన ఆలయ కమిటీ, ముదిరాజ్ సంఘం నేతలు.
Kadtal: పెద్దమ్మ తల్లి ధ్వజస్తంభ ప్రతిష్టకు ఉప్పల వెంకటేష్ గుప్తాకు ఆహ్వానం!
Kadtal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కడ్తాల్ పట్టణంలోని శ్రీ పెద్దమ్మ తల్లి (అపరజాత పెద్దమ్మ) దేవాలయంలో ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు జరిగే కార్యక్రమాలతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గుప్తా కు డిసిసిబి డైరెక్టర్, ఆమనగల్లు సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా తో కలిసి కడ్తాల్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కేశమోని యాదయ్య సభ్యులు కలిసి సోమవారం హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఈ సందర్భంగా వెంకటేష్ గుప్తా ఆహ్వాన పత్రిక విడుదల చేశారు. ఉప్పల వెంకటేష్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఉప్పల చారిటబుల్ ట్రస్టు ద్వారా దేవాలయాలకు తన తోచిన విధంగా ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందని తెలిపారు. దేవాలయాల అభివృద్ధికి ప్రోత్సహిస్తూనే ఉంటానని తెలిపారు. కడ్తాల్ శ్రీ పెద్దమ్మ తల్లి ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు కేశని యాదయ్య, మాజీ వార్డు సభ్యులు మహేష్, సభ్యులు భోల సత్యనారాయణ, మూఢనర్సింహ, బోల జంగయ్య, కేశని మహేష్, చెన్న మౌని శేఖర్, రమేష్, కటికపల్లి రమేష్, రాకేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.




