Talakondapally: నిరుపేద యువతి పెళ్లికి ఉప్పల వెంకటేష్ ట్రస్ట్ చేయూత!
Talakondapally: చుక్కాపూర్ గ్రామానికి చెందిన పూజ వివాహానికి ఉప్పల వెంకటేష్ ఉచిత కల్యాణ మండపంతో పాటు విందు భోజనాన్ని ఏర్పాటు చేసి పెద్ద మనసు చాటుకున్నారు.
Talakondapally: నిరుపేద యువతి పెళ్లికి ఉప్పల వెంకటేష్ ట్రస్ట్ చేయూత!
తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామానికి చెందిన పూజా లక్నమోని వివాహానికి ఉప్పల వెంకటేష్ పెద్ద మనసు చాటుకున్నారు. సెప్టెంబర్ 4న జరగనున్న వివాహానికి తలకొండపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ మండపాన్ని ఉచితంగా అందించడంతో పాటు, ఉప్పల వెంకటేష్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బంధువులకు విందు భోజనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా పూజా తన చెల్లెలు, తమ్ముడితో కలిసి వెంకటేష్ కలిసి పెళ్లి పత్రిక అందించారు. గత 12 ఏళ్లుగా తమ విద్యాభ్యాసానికి సహకరిస్తున్న మాకం శ్రీనివాస్ తో కలిసి వెంకటేష్ రాఖీ కట్టి, శాలువాతో సత్కరించారు. పూజా కుటుంబ పరిస్థితిని తెలుసుకుని వెంకటేష్ గారు ఈ సహాయం ప్రకటించగా, పలువురు ఆయన సేవాభావాన్ని అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ నాయక్, చుక్కాపూర్ సర్పంచ్ మాకం వీరేశలింగం, దిశ రిపోర్టర్ చంద్రకుమార్, వార్డు సభ్యుడు విష్ణు తదితరులు పాల్గొన్నారు.




