Ghatkesar: స్వీట్లపై బొద్దింకలు, నిషేధిత కలర్స్ మిఠాయి తయారీ కేంద్రం సీజ్

Ghatkesar: న్యూ బాలాజీ హుక్మిచంద్ మిఠాయి భండార్ తయారీ కేంద్రంపై ఉప్పల్ జోన్ ఎస్‌ఓటీ దాడులు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన నిర్వాహకుడిపై కేసు నమోదు చేసింది.

KARUNAKAR, UPPAL
Published on: 15 Aug 2026 9:08 AM IST
Ghatkesar
X

Ghatkesar: స్వీట్లపై బొద్దింకలు, నిషేధిత కలర్స్ మిఠాయి తయారీ కేంద్రం సీజ్

Ghatkesar: ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే గడువు ముగిసిన ముడి పదార్థాలు, నిషేధిత సింథటిక్‌ ఫుడ్‌ కలర్స్‌తో అపరిశుభ్ర వాతావరణంలో స్వీట్లు తయారు చేస్తున్న న్యూ బాలాజీ హుక్మిచంద్‌ మిఠాయి భండార్‌ తయారీ కేంద్రంపై శుక్రవారం ఉప్పల్‌ జోన్‌ ఎస్‌ఓటీ, ఎం-ఫాస్ట్‌ బృందం దాడులు నిర్వహించింది.

ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఘట్‌ కేసర్ లో ఉన్న తయారీ కేంద్రంలో తనిఖీలు చేపట్టగా, నిబంధనలకు విరుద్ధంగా సింథటిక్‌ ఫుడ్‌ కలర్స్‌, గడువు ముగిసిన ముడి పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా తయారు చేసిన స్వీట్లపై బొద్దింకలు కనిపించడంతో అపరిశుభ్ర పరిస్థితుల్లో స్వీట్ల తయారీ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.

నిర్వాహకుడు రాజారాం కచ్వాను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో త్రిశూల్‌ సింథటిక్‌ ఫుడ్‌ కలర్‌ ఆరెంజ్‌ రెడ్‌ సూపర్‌ రెండు బాక్సులు, లెమన్‌ ఎల్లో ఫుడ్‌ కలర్‌ బాక్సులు, బ్లూ స్టార్‌ 100 గ్రాముల మూడు బాటిళ్లు, నంది సింథటిక్‌ ఫుడ్‌ కలర్‌ (రెడ్‌, ఎల్లో) రెండు బాటిళ్లు, బుష్‌ సింథటిక్‌ ఫుడ్‌ కలర్‌ ఐదు బాక్సులు, శ్రీ బ్రాండ్‌ సిట్రిక్‌ యాసిడ్‌ 500 గ్రాముల రెండు ప్యాకెట్లతో పాటు గులాబ్‌జామున్‌, కలాకాని, బ్రౌన్‌ కలకండ్‌, బాదం మిల్క్‌, రసమలై తదితర స్వీట్లు, ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రాజారాం కచ్వాతో పాటు స్వాధీనం చేసుకున్న సామగ్రిని ఘట్‌కేసర్‌ పోలీసులకు అప్పగించారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న పదార్థాలకు పంచనామా నిర్వహించి సీజ్‌ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story