Uppal: అసెంబ్లీలో జీవో 97పై స్పష్టత ఇవ్వాలని విద్యార్థుల డిమాండ్!
Uppal: రామంతాపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరవధిక ఆందోళన చేపట్టారు.
Uppal: అసెంబ్లీలో జీవో 97పై స్పష్టత ఇవ్వాలని విద్యార్థుల డిమాండ్!
Uppal: జీవో నంబర్ 97ను రద్దు చేయడంతోపాటు పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి పరిధిలోకి తీసుకురావద్దని డిమాండ్ చేస్తూ రామంతాపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు చేపట్టిన నిరవధిక ఆందోళన గురువారం ఉద్ధృతమైంది.
గత 20 రోజులకుపైగా తరగతులను బహిష్కరించి కళాశాల వద్ద నిరసన కొనసాగిస్తున్న విద్యార్థులు.. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. ఆందోళన తీవ్రతరం కావడంతో కళాశాల వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
విద్యార్థులు కళాశాల నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. జీవో 97 ద్వారా పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి పరిధిలోకి తీసుకురావడాన్ని విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు.
దీనివల్ల తమ విద్యా భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. శక్తి పరిధిలోకి వచ్చిన తర్వాత పాలిటెక్నిక్ విద్యా విధానంలో మార్పులు జరిగే అవకాశం ఉందని అభ్యంతరం తెలిపారు.
స్కిల్ యూనివర్సిటీలో ప్రతిపాదించిన పీపీపీ విధానం వల్ల పాలిటెక్నిక్ కళాశాలల భూములను ప్రైవేటు అవసరాలకు వినియోగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే 42ఏ నిబంధనతో కరిక్యులమ్‌లో మార్పులు చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
పాలిటెక్నిక్ విద్యను ప్రస్తుత సాంకేతిక విద్యా విధానంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం జీవో 97పై స్పష్టత ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
జీవో 97ను రద్దు చేసి, పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి పరిధిలోకి తీసుకురావద్దని అసెంబ్లీ వేదికగా స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. ప్రభుత్వం జీవో 97ను రద్దు చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని విద్యార్థులు స్పష్టం చేశారు. స్పందన లేకపోతే నిరసనలను మరింత ఉద్ధృతం చేస్తామని విద్యార్దులు హెచ్చరించారు.




