Uppal: ఉప్పల్ బహిరంగ మద్యం, నిబంధనల ఉల్లంఘనపై 32 కేసులు నమోదు
Uppal: ఉప్పల్‌లో పోలీసుల ప్రత్యేక తనిఖీలు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 19 మంది, సమయం దాటి దుకాణాలు తెరిచిన 13 మందిపై కేసులు నమోదు.
Uppal: ఉప్పల్ బహిరంగ మద్యం, నిబంధనల ఉల్లంఘనపై 32 కేసులు నమోదు
ఉప్పల్: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజా శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారితో పాటు నిర్ణీత సమయాలకు మించి దుకాణాలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మొత్తం 32 ఈ-పెట్టీ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నమోదైన కేసుల్లో 19 కేసులు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై నమోదు చేయగా, మరో 13 కేసులు రాత్రి వేళల్లో నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు తెరిచి నిర్వహించిన వారిపై నమోదు చేశారు. ఈ కేసులను కోర్టుకు పంపించగా, కోర్టు ప్రతి కేసుకు రూ.500 చొప్పున జరిమానా విధించినట్లు పోలీసులు వెల్లడించారు. రాత్రి వేళల్లో ఓపెన్ బూజింగ్, లేట్ నైట్ దుకాణాల కారణంగా స్థానికులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నందున ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని, చట్టాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు.




