Uppal: వర్షాలకు పాడైన రోడ్ల పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్యే
Uppal: భారీ వర్షాలకు దెబ్బతిన్న ఉప్పల్ బీటీ రోడ్లు, డ్రైనేజీల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వినతిపత్రం ఇచ్చారు.
Uppal: వర్షాలకు పాడైన రోడ్ల పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్యే
Uppal: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఉప్పల్ నియోజకవర్గం లోని పలు డివిజన్ లోని ప్రాంతాల్లో బీటీ రోడ్లు, అంతర్గత సీసీ రోడ్లు, స్టార్మ్ వాటర్ డ్రైనేజీ లైన్లు దెబ్బతిన్నాయని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, కామర్స్ మరియు శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కి వినతిపత్రం సమర్పించారు.
వర్షానికి దెబ్బతిన్న రోడ్ల కారణంగా ప్రజలకు రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పలు ప్రాంతాల్లో వర్షపు నీటి పారుదల వ్యవస్థ కూడా దెబ్బతిన్నందున ప్రజల భద్రత దృష్ట్యా తక్షణ చర్యలు అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కొత్త బీటీ రోడ్ల నిర్మాణం, దెబ్బతిన్న సీసీ రోడ్ల పునర్నిర్మాణం, స్టార్మ్ వాటర్ డ్రైనేజీ లైన్ల అభివృద్ధి కోసం అవసరమైన నిధులను మంజూరు చేయాలని మంత్రి శ్రీధర్ బాబు ని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు.
ప్రజల సౌకర్యం, సురక్షిత రాకపోకలు, వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యల పరిష్కారం కోసం ఈ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు నేమూరీ మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




