Uppal: ఉప్పల్‌లో సమయస్ఫూర్తి 108 అంబులెన్స్‌లోనే గర్భిణి సురక్షిత ప్రసవం!

Uppal: ఉప్పల్‌లో 108 అంబులెన్స్‌లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన నాచారం నివాసి మీరాదేవి. సిబ్బంది సమయస్ఫూర్తితో తల్లీబిడ్డ సురక్షితం, గాంధీ ఆస్పత్రికి తరలింపు.

KARUNAKAR, UPPAL
Published on: 5 Sept 2026 8:35 AM IST
Uppal
X

Uppal: ఉప్పల్‌లో సమయస్ఫూర్తి 108 అంబులెన్స్‌లోనే గర్భిణి సురక్షిత ప్రసవం!  

Uppal: పురిటినొప్పులతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే 108 అంబులెన్స్‌లో ప్రసవం జరిగింది. గర్భిణి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 108 సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. నాచారం నివాసి మీరాదేవి (28) ఎనిమిది నెలల గర్భిణి. పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆమెను ఉప్పల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు.

పరీక్షించిన సిబ్బంది పరిస్థితిని పరిశీలించి మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆస్పత్రికి తరలించాలని సూచించారు. దీంతో 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ నాగరాజు, పైలట్‌ ఉపేందర్‌ పీహెచ్‌సీకి చేరుకుని మీరాదేవిని గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు.

మార్గమధ్యలో పురిటినొప్పులు తీవ్రం కావడంతో అంబులెన్స్‌లోనే అత్యవసర ప్రసవం నిర్వహించారు. దీంతో మీరాదేవి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం తల్లీబిడ్డను గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.

ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అత్యవసర సమయంలో సమయస్ఫూర్తితో స్పందించి ప్రసవాన్ని సురక్షితంగా నిర్వహించిన 108 సిబ్బందిని కుటుంబసభ్యులు అభినందించారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story